చలివేంద్రాలు, పెరుగన్నం పంపిణీ కేంద్రం ప్రారంభం


Wed,April 24, 2019 11:55 PM

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ : పట్టణంలోని ఐబీ ఏరియాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలతోపాటు బెల్లంపల్లి చౌరస్తాలో మమత తరంగిణి ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన పెరుగన్నం పంపిణీ కేంద్రం, చలివేంద్రాలను బుధవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చాలన్న ఉద్దేశంతో పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు చలివేంద్రాలను ఏర్పాటుచేసి తాగునీటిని అందిస్తున్నాయని, మరికొన్ని సంఘాల సభ్యు లు పెరుగన్నం, మజ్జిగలను సైతం పంపి ణీ చేస్తున్నారని పేర్కొన్నారు. వేసవి కాలంలో శరీరానికి అవసరమైన పోషకా లు, క్యాలరీలను అందించే పదార్థాలతో ప్రజలు ఎండదెబ్బకు గురికాకుండా ఉం టారనీ, ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి ఎంతగానో దోహద పడుతాయని తెలిపా రు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురా లు మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, టీఆర్‌ఎస్ బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు గొంగళ్ల శంకర్, మమత తరంగిణి సభ్యులు భాగ్యలక్ష్మి, మంజుల, మాధురి, తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...