న్యాయం చేస్తాం..


Wed,April 24, 2019 01:59 AM

-బాధిత రైతులతో తాసిల్దార్ ప్రకాశ్
-ముగ్గురు రైతుల ఇంటికి వెళ్లి వివరాల సేకరణ
-నమస్తే కథనాలతో కదిలిన రెవెన్యూ అధికారులు
నెన్నెల : నమస్తేలో వరుసగా ప్రచురితమవుతున్న ధర్మగంట కథనాలతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ మేరకు మంగళవారం బాధిత రైతుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించడంతో పాటు వారికి న్యాయం చే స్తామని నెన్నెల తాసిల్దార్ ప్రకాశ్ హామీ ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వీఆర్వోలతో కలిసి మండలంలోని చిత్తాపూర్, నందులపల్లి, నెన్నెల గ్రామాలకు వె ళ్లారు. ఈ సందర్భంగా అక్కడికక్కడే పంచనామా చేసి వారి వాంగ్మూలం తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మే రకు తహసీల్దార్ ప్రకాశ్, వీఆర్వోలు మం గళవారం మండలంలోని ముగ్గురు బాధితుల ఇండ్లకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. రైతుల వద్ద ఉన్న రికార్డు లు, అధికారుల వద్ద ఉన్న వా టితో సరిచూసి అక్కడకిక్కడే పం చనామా చేయడంతో పాటు వాంగ్మూలాలు తీసుకున్నారు.

చి త్తాపూర్‌లో ఈగం శంకరయ్య భూమికి సం బంధించి రికార్డులు చూడగా శంకరయ్యకు 2014లో తప్పుడు ధ్రువపత్రాలను ఇచ్చి పాస్ బుక్కు కూడా ఇ చ్చి ఆయనను మోసం చేశారని తహసీల్దార్ గుర్తించారు. ఆయ న తనకు భూమి ఉందనే నమ్మకంతో పలుమార్లు దరఖాస్తు చేసుకున్న మాట నిజమేనన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి శంకరయ్యకు న్యాయం చేస్తామన్నారు. అలాగే యాదబోయిన మల్ల య్య భార్య శంకరమ్మ 36 గుంటల భూమిని రికార్డుల్లోకి ఎక్కిస్తామన్నారు. నెన్నెలకు చెందిన చెన్నోజి వెంకన్న భూమి ఎక్కడికీ పోలేదనీ, సర్వేయర్‌తో సర్వే చేయించి ఎంత ఉంటే అంత పాస్ బుక్కులో ఎక్కిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని తాసిల్దార్ ప్రకాశ్ నమస్తే తెలంగాణకు తెలిపారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...