రెండో రోజు 30 నామినేషన్లు దాఖలు


Wed,April 24, 2019 01:57 AM

-ఎంపీటీసీ స్థానాలకు 27
-భీమిని జడ్పీటీసీ స్థానానికి ఇద్దరు, కన్నెపల్లి జడ్పీటీసీ స్థానానికి ఒక నామినేషన్

పరిషత్ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గవ్యాప్తంగా ఆయా మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు రెండో రోజు మంగళ వారం 27నామినేషన్లు దాఖలు అయ్యాయి. భీమినిలో ఇద్దరు, కన్నెపల్లిలో ఒక్కరు జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేశారు. నామినేషన్లకు బుధవారం చివరి తేదీ కానుండడంతో భారీగా పడే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
బెల్లంపల్లిరూరల్ : బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం రెండో రోజు ఎంపీటీసీ స్థానానికి అభ్యర్థుల నుంచి రెండు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా సహా య ఎన్నికల అధికారి ఆకుల వెంకటేశ్ తెలిపారు. బూదాఖు ర్ధు ఎంపీటీసీ స్థానానికి సింగతి స్వప్న, సోమగూడెం ఎంపీటీసీ స్థానానికి చుంచు మల్లమ్మ నామినేషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు. మండలంలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలుండగా రెండు స్థానాల్లో ఇద్దరే నామినేషన్లు సమర్పించారు.
తాండూర్ : మండలంలోని వివిధ గ్రామాల్లో ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం 9 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా సహాయ ఎన్నికల అధికారి, తాండూర్ ఎంపీడీఓ శశికళ తెలిపారు. కిష్టంపేటలో ఎంపీటీసీకి స్వతంత్ర అభ్యర్థిగా దుర్గం అణుబాయి, కాసిపేట స్వతంత్ర అభ్యర్థిగా కొమ్మ భీమయ్య, తాండూర్-2లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎండీ జుబేర్, స్వతంత్ర అభ్యర్థులుగా ఎండీ జావేద్, దుర్గాచరణ్, రేచిని ఎంపీటీసీకి స్వతంత్ర అభ్యర్థిగా ముదిగిరి కొమురయ్య, అచ్చలాపూర్ ఎంపీటీసీకి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దాగాం నారాయణ, కొత్తపల్లి నుంచి ఎంపీటీసీకి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పట్నపురం నిర్మల, మాదారం నుంచి ఎంపీటీసీకి బీజేపీ అభ్యర్థిగా వై తుకారాం నామినేషన్లు దాఖలు చేశారు.
నెన్నెల : రెండో రోజు నెన్నెలలో మూడు నామినేషన్లు దాఖ లు చేశారు. మైలారం నుంచి గురునాథం సుమలత, గొల్లపల్లి నుంచి కొమ్ము గంగమల్లు, నెన్నెల నుంచి గట్టు శివలింగయ్య నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు రెండు రోజుల్లో ఐదు నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీఓ రాధాకృష్ణ తెలిపారు.

భీమిని(కన్నెపల్లి) : భీమిని మండలంలో నాలుగు ఎంపీటీ సీ స్థ్ధానాలకు మంగళవారం నాలుగు నామినేషన్లు దాఖలు అయ్యాయి. కన్నెపల్లి మండలంలో ఐదు ఎంపీటీసీ స్థ్ధానాల కు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిని ఎంపీటీసీ స్థానానికి పసులోటి శ్రీనివాస్, చిన్నగుడిపేట రెడ్డి స్వామి, పెద్దపేట స్థానానికి పోతురాజుల ఉమాదేవి, పోతురాజుల రాజేశ్వరి నామినేషన్లు దాఖలు చేశారు. కన్నెపల్లి మండలం లో సుర్జాపూర్‌కు బేర తిరుమల, మామిడిపల్లికి రాకేశ్, కన్నెప ల్లికి మైదం రవీందర్ నామినేషన్లు దాఖలు చేశారు. భీమిని జడ్పీటీసీ స్థ్ధానానికి పోతురాజుల సంధ్యారాణి, పోతురాజుల బాణక్క నామినేషన్లు వేశారు. కన్నెపల్లి జడ్పీటీసీ స్థానానికి బేరి రామయ్య నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు శ్రీనివాస్, దేవానంద్, శ్రీనివాస్ తెలిపారు.
కాసిపేట : కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి మంగళవారం రెండో రోజు రెండు నామినేషన్లు పడ్డాయి. పెద్దనపల్లి ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా బానోత్ పరుశురాం, బానో త్ భాస్కర్ నామినేషన్లు వేశారు. జడ్పీటీసీ, 9 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలోనే నాలుగు కేం ద్రాలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెద్దన పల్లి ఎంపీటీసీ స్థానాల ఆర్‌ఓ ఎం చందర్, ఏఆర్‌ఓ రమేశ్, జేఏ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
వేమనపల్లి : మండల పరిషత్ కార్యాలయంలో మంగళ వారం నలుగురు అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ వేసినట్లు ఎంపీడీఓ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ముల్కలపేట ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కామర మల్లేశ్ నామినేషన్ వేశాడు. డోలె రాజబాపు, ఎన్నం సంజయ్‌లు టీఆర్‌ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. వేమనపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి తోకల లక్ష్మి నామినేషన్ వేశారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...