ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి


Wed,April 24, 2019 01:56 AM

-సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి
-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరి
మంచిర్యాల అగ్రికల్చర్ : మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళ వారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్‌లో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి బీ శేషాద్రితో కలిసి ఎన్నికల నోడల్ అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని 16 మండలాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సిబ్బంది, బృందాలను నియమించాలన్నారు. వీఎస్‌టీ, వీవీటీ, ఎస్‌ఎస్‌సీ, ఏఈఓలను బృందాలుగా ఏర్పాటు చేసుకొని సూక్ష్మ పరిశీలకులు, ఇతర వివరాలను ద్వితీయ ర్యాండమైజేషన్ సకాలంలో పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో అవసరమైన చోట సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నిర్వాహణకు అవసరమైన డేటా పూర్తి స్థాయిలో చేపట్టాలని, వెబ్ కాస్టింగ్, జోనల్ అధికారులు, రూట్ అధికారులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని తెలిపారు. 745 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని.. 3,4 ఎంపీటీసీ స్థానాలను ఒక క్లస్టర్‌గా 44 క్లస్టర్లు చేశామని వివరించారు.

ప్రతి క్లస్టర్‌కు ఒక రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి చొప్పున 88 మందిని 16 మంది రిటర్నింగ్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకుగాను అవసరమైన సామగ్రిని జిల్లాలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. మండల ప్రజా పరిషత్ స్థానానికి గులాబీ రంగు, జిల్లా ప్రజాపరిషత్ స్థానానికి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు ఉంటాయని తెలిపారు. ఎన్నికలు ప్రణాళిక, నామినేషన్ పత్రాల స్వీకరణ, ముగింపు అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య ఆధారంగా బ్యాలెట్ పత్రాల్లో గుర్తుల ముద్రణ, బ్యాలెట్ పత్రాలు ఎన్నికల సంఘం జారీ చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఫారం - 9, పోస్టల్ బ్యాలెట్, ఫారం - 14లను పకడ్బందీగా నిర్వహించాలని, పోస్టల్ బ్యాలెట్ కోసం నోడల్ అధికారిని నియమిస్తామని చెప్పారు. ఉత్తర్వుతో పాటు ఫారం-14 పంపాలని తెలిపారు. స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ హాలులో సిద్ధం చేసుకోవాలని, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో భూసేకరణ ప్రత్యేకాధికారి రాజేశ్వర్, డీఈఓ రషీద్, డీపీఓ వీరబుచ్చయ్య, సీపీఓ సత్యనారాయణ రెడ్డి, డీఏఓ వుల్లోజు వినోద్ కుమార్, డీసీఓ సంజీవ రెడ్డి, డీడబ్ల్యూఓ రౌఫ్‌ఖాన్, ఎన్నికల నోడల్ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...