రక్షణ, ఉత్పత్తికే ప్రాధాన్యం


Wed,April 24, 2019 01:56 AM

- ప్రతి కార్మికుడూ రక్షణ సూత్రాలు పాటించాలి
- బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్
- రెస్క్యూ సేవలపై అవగాహన
రెబ్బెన : సింగరేణి గనుల్లో కార్మికులకు రక్షణతో కూడిన ఉత్పత్తికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్ స్పష్టం చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని కైర్‌గూడ ఓసీపీలో మంగళవారం గని ప్రమాదాలు జరిగినపుడు ఎలా బయటపడాలి ? అనే అంశంపై కార్మికులకు మందమర్రి ఏరియాకు చెందిన రెస్క్యూ బృందం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జీఎం రవిశంకర్ హాజరై మాట్లాడారు. కార్మికులు అందరూ రక్షణ సూత్రాలు తప్పకుండా పాటిస్తూ బొగ్గు ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. గని ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రమాదాలు సంబవించినప్పుడు బాధితులను రక్షించడంలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది బాగా పని చేశారని తెలిపారు. వేసవి ఎండల తీవ్రత కారణంగా గని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ రక్షణ సూత్రాలు పాటిస్తే వీటిని నివారించవచ్చునని తెలిపారు. రెస్క్యూ సిబ్బంది కొసం సింగరేణి యాజమాన్యం నూతన పరికరాలు సైతం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆధికారులు మోహన్‌రెడ్డి, పురుషోత్తమ్‌రెడ్డి, రెస్క్యూ మేనేజర్ జగ్గారెడ్డి లతో పాటు పలువురు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...