35 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత


Wed,April 24, 2019 01:55 AM

నెన్నెల : మామిడి పండ్ల బుట్టలు తరలించే బోలోరోలో అక్రమంగా 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా ఎస్‌ఐ మొగిలి పట్టుకున్నారు. మంగళవారం ఆవుడం చిత్తాపూర్ గ్రామాల మధ్యలో రోడ్డు పై ఆగి ఉన్న బోలోరో వ్యాన్‌ను తనిఖీ చేస్తుండగా బి య్యం సంచులు కనబడ్డాయి . దీంతో వ్యాన్ ను పూర్తి స్థాయిలో తనిఖీ చేయగా 35 క్విం టాళ్లు ఉన్నట్లు గుర్తించారు, ఆవుడం వైపు నుంచి నెన్నెల వైపు బోలోరో వ్యాన్‌లో బియ్యం బస్తాలు నింపి అవి కనబడకుండా చుట్టు మామిడి కాయలు తరలించేందుకు ఉపయోగించే ఖాళీ ప్లాస్టిక్ పెట్టెలు అమర్చారు. లోడ్‌తో వస్తుండగా రోడ్డుపై ఉన్న వ్యాన్‌ను అటుగా వెళ్తున్న ఎస్‌ఐ తనిఖీ చేశారు. ఆయన తనిఖీలో బియ్యం బయట పడ్డాయి, బియ్యం ఎక్కడివి అన్న విషయం పై ఆరా తీస్తున్నామనీ, ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారో తగిన వివరాలు తెలుసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...