సాగునీటి పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేయండి


Wed,April 24, 2019 01:55 AM

-జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
మంచిర్యాల అగ్రికల్చర్ : జిల్లాలోని అన్ని గ్రామాల్లో భూగర్భ జల వనరులు, ఉపరితల జల వనరులను లెక్కించి సాగునీరు పంపిణీ కోసం ప్రణాలిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పేర్కొన్నారు. మంగళ వారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా జాయిం ట్ కలెక్టర్ వై సురేందర్ రావు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి మండల తాసీల్దార్లు, ఎంపీడీలకు 6వ చిన్న తరహా సాగునీటి వనరులు, జలాశయాలు, 2017-18 సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ, ఉపరితల జల వనరులను లెక్కించి వాటి కింద సాగైన విస్తీర్ణం, నీటి పంపిణీ విధానం, భూగర్భ నీటి మట్టం, భూగర్భ జలం సగటులోతు గణన చేయాలని సూచించారు. ప్రతి భూగర్భ, ఉపరితల వనరులను జియోటాగ్ చేయడంతోపాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జలాశయాలను లెక్కించి వాటిని కూడా జియోటాగ్ చేస్తామని పేర్కొన్నారు. త్వరలో మండ ల స్థాయి ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు, తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...