ఎర్రగుంటపల్లి పాఠశాలలో మెరుగైన విద్య


Mon,April 22, 2019 11:27 PM

మంచిర్యాల అగ్రికల్చర్ : చెన్నూర్ మండలం ఎర్రగుంటపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం సమష్టి కృషితో విద్యార్థులకు మెరుగైన విద్యనందించడం అభినందనీయమని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్‌లో జాయింట్ కలెక్టర్ వై సురేందర్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి రషీద్‌తో కలిసి పాఠశాలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం గా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధిస్తున్నారని, విద్యార్థులపై శ్రద్ధ, ఆట, పాటలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు చదువుకునేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు పాఠశాలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమన్నారు. సెక్టోరల్ అధికారి ఈ పద్మజ, పాఠశాల హెచ్‌ఎం పుట్ట కొండయ్య, ఉపాధ్యాయులు సుందిళ్ల రమేష్, జనగామ శంకర్ పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...