టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి


Mon,April 22, 2019 11:27 PM

బెల్లంపల్లినమస్తే తెలంగాణ : జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం కన్నెపల్లి టీఆర్‌ఎస్ ప్రజాప్రజాప్రనిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వారికి దిశానిర్దేశం చేశారు. జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో అన్నిస్థానాలను కైవసం చేసుకునే దిశగా పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే గ్రామాలు, పట్టణాలు గణనీయంగా అభివృద్ధి చెందాయన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను చూసి ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. అందుకే ఇటీవల జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరించారని పేర్కొన్నారు. ప్రజల్లో ప్రభుత్వం పాలనపై బలమైన నమ్మకం ఉందని చెప్పారు. అనమ్మకంతోనే ప్రజలు మళ్లీ స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆరాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసి స్థానిక ఎన్నికల్లో కారుగుర్తును గెలిపించాలని కోరారు. కారుగుర్తు గెలిస్తే గ్రామాలకు భవిష్యత్ ఉంటందని చెప్పారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ మండల నాయకులు నర్సింగరావు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...