నామినేషన్లు షురూ..


Mon,April 22, 2019 11:27 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాదేశిక ఎన్నికల్లో మొదటి రోజు నామినేషన్ల పర్వం మొదలైంది. కాగజ్‌నగర్ డివిజన్‌లోని ఆరు మండలాల్లో 6 జడ్పీటీసీలు, 45 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, మొదటి రోజు జడ్పీటీసీ స్థానాలకు 3, ఎంపీటీసీ స్థానాలకు 12 నామినేషన్లు దాఖలు అయ్యాయి. దహెగాం మండంలో జడ్పీటీసీ స్థానం కోసం ఒక నామినేషన్ దాఖలు కాగా, బెజ్జూర్ మండలంలో రెండు నామినేషన్లు వచ్చాయి. ఇక ఎంపీటీసీ స్థానాల కోసం బెజ్జూర్ మండలంలో ఐదుగురు, చింతలమానేపల్లి మండలంలో ఇద్దరు అభ్యర్థులు మూడు నామినేషన్లు, కౌటాల మండలంలో రెండు, దహెగాం మండలంలో ఒకటి, పెంచికల్‌పేట్ మండలంలో ఒక నామినేషన్లు వచ్చాయి. మొత్తం 11 మంది అభ్యర్థులు 12 నామినేషన్లు దాఖలు చేశారు. కౌటాల, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్, సిర్పూర్-టి మండలాల నుంచి జడ్పీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...