తొలి రోజు తొమ్మిది


Mon,April 22, 2019 11:27 PM

బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(జడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) అభ్యర్థుల నామినేషన్ల ఘట్టం ప్రారంభమైం ది. సోమవారం మండల కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మొదటి విడతలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. ఏడు జడ్పీటీసీ, 47 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. తాండూర్ మండలం లో ఎంపీటీసీ స్థానాలకు ఆరు నామినేషన్లు వ చ్చాయి. ఇందులో టీఆర్‌ఎస్ 2, కాంగ్రెస్ 2, ఇద్దరు స్వతంత్రులు నామినేషన్ వేశారు. బోయపల్లి ఎంపీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మాసాడి శ్రీదేవి, మాసాడి లక్ష్మిలు, కాంగ్రెస్ పార్టీ నుంచి చాంద రుక్మిణి, మాదారంలో ఎంపీటీసీ-1 స్థానానికి స్వతంత్ర అభ్యర్థి సాబీర్ హుస్సేన్, కిష్టంపేట ఎంపీటీసీ-1 స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి పగిడి లలిత, రేచిని ఎంపీటీసీ-1 స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సత్యనారాయణగౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు. నెన్నెల మండలంలో ఎంపీటీసీ స్థానాలకు రెండు నామినేషన్లు వచ్చాయి.

టీఆర్‌ఎస్ నుంచి ఒకటి, కాంగ్రెస్ నుంచి ఒకటి వేశారు. నెన్నెల స్థానానికి గట్టు శిలింగయ్య, గొల్లపల్లి స్థానానికి గడ్డం కళ్యాణి నామినేషన్ వేశారు. భీమిని మండలంలో స్వతంత్ర అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేశారు. బెల్లంపల్లి, కాసిపేట, వేమనపల్లి, కన్నెపల్లి మండలాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇగ, జడ్పీటీసీ స్థానాలకు ఏ మండలంలో పత్రాలు రాలేదు. కాగా, మంగళవారం, బుధవారం నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. ఆఖరి రోజు బుధవారం మంచిరోజు కావడంతో అత్యధికంగా నామినేషన్లు పడే అవకాశం ఉంది.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...