ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి


Mon,April 22, 2019 11:27 PM

మంచిర్యాల స్పోర్ట్స్ : ఏప్రిల్ 24వ తేదీ నుంచి జరగనున్న ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్, డీవోలకు డీఈవో ఎంఏ రషీద్ సూచించారు. మే 9వ తేదీ దాకా జరగనున్న పరీక్షలకు సంబంధించి సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలనీ, పరీక్ష హాలులోనికి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌పోన్స్ అనుమతించకూడదన్నారు. అభ్యర్థులు పరీక్షా ప్యాడ్, హాల్‌టికెట్ మాత్రమే వెంట తెచ్చుకునేలా తెలియజేయాలన్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్ష ముగిసేదాకా ఎవరినీ బయటకు పంపవద్దని తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ఓపెన్‌స్కూల్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షలు సజావుగా జరిగిందేకు రెండు ఫ్లయింగ్ స్కాడ్ టీమ్స్ ఏర్పాటు చేశామనీ, సిట్టింగ్ స్కాడ్ ఏర్పాటు కోసం కలెక్టర్ అనుమతి కోరామని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ దామోదర్, డీసీఈబీ కార్యదర్శి భీంరావు, సీఎస్‌లు, డీవోలు పాల్గొన్నారు.

ఎస్సెస్సీకి 6, ఇంటర్‌కు 6 పరీక్షా కేంద్రాలు..
ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ పరీక్షలకు 6, ఇంటర్ పరీక్షలకు 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎస్సెస్సీలో 1383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకు జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల, గర్మిళ్ల ప్రభుత్వ పాఠశాల, చెన్నూర్ రోడ్ ప్రభుత్వ పాఠశాల, తీగల్‌పహాడ్ జడ్పీ ఉన్నత పాఠశాల, బెల్లంపల్లిలోని ఇైంక్లెన్-2 జడ్పీ పాఠశాల, జడ్పీ బాలికల పాఠశాలలో కేటాయించారు. ఇంటర్మీడియెట్‌లో 1738 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకు మంచిర్యాల జడ్పీ బాలికల పాఠశాల, పాత మంచిర్యాలలోని ప్రభుత్వ పాఠశాల, ఆర్‌బీహెచ్‌వీ పాఠశాల, ఆదర్శ పాఠశాల, సినిమావాడ పాఠశాల, బెల్లంపల్లిలోని బజార్ ఏరియా జడ్పీ ఉన్నత పాఠశాలలో కేటాయించారు. ఎస్సెస్సీ పరీక్షలకు ఆరుగురు సీఎస్‌లు, ఆరుగురు డీవోలు, ఇంటర్మీడియెట్‌లో ఆరుగురు సీఎస్‌లు, ఆరుగురు డీవోలు, ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...