ఉత్సాహంగా సైన్స్ సమ్మర్ క్యాంప్


Mon,April 22, 2019 11:26 PM

మంచిర్యాల స్పోర్ట్స్ : జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్‌లో సైన్స్ సమ్మర్ క్యాంప్ ఉత్సాహంగా సాగుతున్నది. ఏప్రిల్ 18వ తేదీన ప్రారంభమైన ఈ శిబిరంలో 6 నుంచి 10వ తరగతి దాకా చదువుతున్న విద్యార్థులు 50 మంది పాల్గొంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకా సైన్స్‌పై అవగాహన పెంచుకుంటూ ప్రయోగాల గురించి తెలుసుకుంటున్నారు. డీఈవో ఎంఏ రషీద్ ఆదేశాల మేరకు జిల్లా సైన్స్ అధికారి మధుబాబు ఆధ్వర్యంలో శిబిరం కొనసాగుతుండగా, విద్యార్థులకు సైన్స్ పరికరాలు, సైన్స్ గేమ్స్, ప్రయోగాలు, రోబోలు, డ్రోన్స్ గురించి తెలియజేస్తున్నారు. సోమవారం ఎజెక్స్ సంస్థకు చెందిన మెంటర్ నరేందర్ విద్యార్థులకు ట్రేడ్ బోర్డులపై రెసిస్టక్స్, లెడ్స్, మోటర్స్, బజర్ వంటి పరికరాల అనుసంధానం, స్టెమ్ కిట్ ద్వారా 75 ప్రయోగాలు చేయడం వంటివి నేర్పించారు. ఏప్రిల్ 22న భూగోళ సంరక్షణ దినోత్సవ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు సైన్స్ అధికారి మధుబాబు అవగాహన కల్పించారు. మంగళవారం సైన్స్ మ్యాజిక్ షో ఉంటుందని తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...