భూకబ్జాపై కదిలిన యంత్రాంగం


Mon,April 22, 2019 11:26 PM

ధర్మగంట కథనానికి స్పందన
బెల్లంపల్లిరూరల్ : ధర్మగంటలో భాగంగా బెల్లంపల్లి మండలం చాకెపల్లి (రాళ్లపేట) - తాండూర్ మండలం అచ్చులాపూర్ శివారులోని సర్వే నెంబర్ 972లో 32 ఎకరాల ప్రభుత్వ భూమి పరాధీనమైన విషయాన్ని నమస్తే తెలంగాణ బాధిత రైతుల ద్వారా తెలుసుకుని సోమవారం ప్రచురించింది. ఈ కథనానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ భారతి హోలికేరి భూకబ్జా తతంగంపై తాండూర్ తాసీల్దార్‌తో పాటు సిబ్బందిని పక్కాగా విచారించి తనకు నివేదిక పంపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలు అందుకున్న తాండూర్ రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన చాకెపల్లి- అచ్చులాపూర్ శివారులోని 972 సర్వే నెంబర్‌లో కబ్జాకు గురైన 32 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. మాజీ సింగరేణి కార్మికుడు తమ పట్టా భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపిస్తున్న బాధితులను తాండూర్ రెవెన్యూ ఇన్‌పెక్టర్ ప్రభులింగం, అచ్చులాపూర్ వీఆర్‌ఓ చంద్రమౌళి విచారించారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు నివేదించి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...