జోరందుకున్న వరికోతలు


Mon,April 22, 2019 02:04 AM

-కళ్లాల్లో భారీగా ధాన్యం రాశులు
మంచిర్యాల అగ్రికల్చర్ : జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి యాసంగిలో వరిసాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా సాధారణ వరి పంట సాగు 11, 838 హెక్టార్లు కాగా ఈ ఏడాది రబీలో 27,886 హెక్టార్లలో వరి సాగు చేశారు. రైతులు సాగు చేసిన పంట ఎండిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అందించడంతోపాటు జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో పాటు గూడెం ఎత్తిపోతల పథకం, నీల్వాయి, గొల్లవాగు, ర్యాలీవాగు ప్రాజెక్టుల నుంచి సాగు నీరు అందడంతో రైతులు రందీ లేకుండా సాగు చేశారు. పంట అంతా కోత దశకు చేరుకోవడంతో రైతులంతా వరికోతల బిజీ బిజీగా మారారు. ఏ గ్రామంలో చూసి నా వరికోతలే కనిపిస్తున్నాయి. మరోవైపు పరిషత్ ఎన్నికలు రానున్న దృష్ట్యా ఈలోపే కోతలు ముగించేద్దామనే ఆలోచనలో సైతం రైతాంగం ఉంది. కోతలు ముమ్మరం కావడంతో కొనుగోలు కేంద్రాలన్నీ ధాన్యంతో కళకళలాడుతున్నాయి. జిల్లాలో 176 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు ఏజెన్సీల ద్వారా ధాన్యంను మిల్లులకు తరలిస్తుండటంతో రైతులు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బిజీబిజీగా రైతులు, హార్వెస్టర్లు
పంట కోతకు వచ్చిన నేపథ్యంలో రైతులు బిజీబిజీగా మారారు. ఉదయాన్నే హార్వెస్టర్లను పొలాల వద్దకు తీసుకెళ్లి కోత పట్టి దేవుడికి నైవేద్యం సమర్పించి హార్వెస్టర్ల సహాయంతో వరి కోత కోయిస్తున్నారు. కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ట్రాక్టర్‌లను అందుబాటులో ఉంచుకొని వెంట వెంటనే కల్లాలకు తరలిస్తున్నారు. వారం రోజులు చేసినా కాని పని గంటల్లో పూర్తవుతుండటంతో రైతులకు కష్టం తప్పినట్లయింది.

కళ్లాల్లో ధాన్యం కుప్పలు
జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 70 వేల ఎకరాలలో వరి సాగు చేయగా 1, 71, 161 మెట్రి క్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వారి అంచనాలు ఏమా త్రం తీసిపోకుండా కొనుగోళ్లు ప్రారంభంలోనే కళ్లా ల్లో ధాన్యం రాశులు కళకళలాడుతున్నాయి. రైతులు సైతం మూడు నెలల కష్టం కండ్ల ముందు కనిపిస్తుంటే ఆనందంగా ఉన్నారు. జిల్లాలోని దండేపల్లి మండలంలో అత్యధికంగా 32,676 మెట్రిక్ టన్ను ల ధాన్యం, జైపూర్‌లో 25,692 మెట్రిక్ టన్నులు, చెన్నూర్‌లో 22,394 మెట్రిక్ టన్నులు, లక్షెట్టిపేటలో 20,450 మెట్రిక్ టన్నులు, హాజీపూర్‌లో 15,848 మెట్రిక్ టన్నులు, కన్నెపల్లిలో 9,889 మెట్రిక్ టన్నులు, జన్నారంలో 8, 792 మెట్రిక్ టన్నులు, భీమారంలో 8,721 మెట్రి క్ టన్నులు, కోటపల్లిలో 7,566 మెట్రిక్ టన్నులు, బెల్లంపల్లిలో 5,264 మెట్రిక్ టన్నుల ధాన్యం, మందమర్రిలో 4,689 మెట్రిక్ టన్నులు, నెన్నెలలో 2,648 మెట్రి క్ టన్నులు, వేమనపల్లిలో 2,125 మెట్రిక్ టన్నులు , తాండూరులో 1,996 మెట్రిక్ టన్నులు, భీమినిలో 1,168 మెట్రిక్ టన్నులు, నస్పూర్‌లో 479 మెట్రిక్ టన్నులు, కాసిపేటలో 447 మెట్రిక్ టన్నులు, మంచిర్యాల మండలంలో 319 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారుల అంచనా మించేలా ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

అందుబాటులో ధాన్యం కొనుగోలు కేంద్రాలు
తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఆఖరు వరకు రైతుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దనే ఉద్దేశంతో అన్ని వసతులు రైతుకు అందుబాటులో ఉంచింది. రైతులకు రవాణా ఖర్చులు తగ్గించేందుకు వారికి అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే పండించిన పంటకు మద్ధతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ఏ గ్రేడ్ రకానికి రూ. 1770 కాగా సాధారణ రకానికి రూ. 1750గా పెంచి కొనుగోలు చేస్తుంది. మరోవైపు గతంలో మాదిరి గన్నీ సంచుల కొరత ఉండకుండా ఉండేందుకు ముందస్తుగా సివిల్ సప్లయ్ అధికారులు ప్రణాళిక ప్రకారం గోనె సంచులను జిల్లాకు తెప్పించడమే కాకుండా వాటిని కేంద్రాలకు తరలించారు. జిల్లాలో డీఆర్‌డీఏ ఐకేపీకి చెందిన 63, మెప్మాకు చెందిన 2 కేంద్రాలతోపాటు పీఏసీఎస్ 80, డీసీఎంఎస్ 31 కొనుగోలు కేంద్రాల ధ్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. వాటిని వెంట వెంటనే మిల్లులకు తరలిస్తున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...