వైశ్యులు అన్ని రంగాలలో రాణించాలి


Mon,April 22, 2019 02:00 AM

- ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంతయ్య
మంచిర్యాల అగ్రికల్చర్ : వైశ్యులు వ్యాపారం, సేవతో పాటు అన్ని రంగాలలో రాణించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్మాసు కాంతయ్య పేర్కొన్నారు. ఆదివారం వైశ్య భవన్‌లో జరిగిన మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ మొదటి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆర్య వైశ్య సంఘానికి మంచి ప్రాధాన్యత ఉందని, దానిని కాపాడుకుంటూ నిరుపేద వైశ్యులను ఆదుకోవాలని సూచించారు. విద్యానిధిని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు సహాయ సహాకారాలు అందించాలన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పోటీ లో నిలిచే వారికి తోడ్పాటునందిస్తామని తెలిపారు.

అనంతరం ఇటీవల జిల్లాలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో వివిధ పార్టీల నుంచి బరిలో దిగి సర్పంచులు, ఉప సర్పంచు, వార్డు సభ్యులుగా విజయం సాధించిన జక్కు భూమేశ్, కే నరేందర్, పుల్లూరి సుమతి, రాజయ్య, బోనగిరి కమలాబాయి, బోనగిరి లావణ్య, ఓం ప్రకాశ్ గుప్తాను ఈ సందర్భంగా శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు ముక్త శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చెట్ల రమేశ్, గౌరవ అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు ముస్త్యాల సుధాకర్, రేణికుంట్ల శ్రీనివాస్, గుండ సుధాకర్, కొలిపాక విద్యాసాగర్, భాస్కర్, రాజమౌళి, యూత్ జిల్లా అధ్యక్షుడు ముత్యాల సుజిత్, కార్యదర్శి సంతోష్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షుడు కంభంపాటి కమలాకర్, కేశెట్టి వంశీకృష్ణ, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైశ్య నాయకులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...