ఘనంగా ఈస్టర్ వేడుకలు


Mon,April 22, 2019 01:59 AM

-చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
సీసీసీ నస్పూర్ : నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీసీసీ, శ్రీరాంపూర్ ఏరియాలో గల చర్చిల్లో గుడ్‌ఫ్రైడే తర్వాత నిర్వహించే ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. చర్చిలను కమిటీ సభ్యులు సుందరంగా అలంకరించారు. ఆదివారం ఉదయాన్నే చర్చిలకు చేరుకున్న క్రైస్తవులు ముందుగా ఏసుక్రీస్తు మోసిన సిలువపై దీపారాధన చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీసీసీ సీఎస్‌ఐ చర్చిలో సంఘ కాపరి రెవ. డీ మధుకుమార్ ఆధ్వర్యంలో ఆరాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన బైబిల్ సూక్తులపై ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రైస్తవులకు శాంతి సందేశాన్నిచ్చారు. ఏసుక్రీస్తు సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాస్ట్రేట్ స్టువర్ట్ విటేకర్, పాస్ట్రేట్ కార్యదర్శి అనిల్‌రాజ్, కమిటీ సభ్యులు, యూత్ సభ్యులున్నారు.
దండేపల్లి : దండేపల్లి మండల కేంద్రంతో పాటు తాళ్లపేటలో క్రైస్తవ సోదరులు ఆదివారం ఈస్టర్(పునరుత్థాన పండుగ)ను నిర్వహించారు. శిలువ వద్ద మహిళలు కొవ్వొత్తులు వెలిగించి స్మరించుకున్నారు. ఆరాధన దైవానికి ప్రత్యేక ప్రార్థనలతో చర్చీలు సందడిగా మారాయి. కొంతమంది క్రైస్తవ సోదరులు తమ ఆప్తుల సమాధుల వద్ద కొవొత్తులు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ తీశారు. చర్చిలో పాస్టర్ దైవసందేశం వినిపించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ఐ చర్చ్‌ఫాస్టర్లు, రెవ డాక్టర్ ఏఆర్ సాల్మన్‌రాజ్, భక్తులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...