గ్రిల్స్‌లో ఇరుక్కున్న యువతి కాలు


Mon,April 22, 2019 01:59 AM

మంచిర్యాల అగ్రికల్చర్ : మంచిర్యాల జిల్లా దవాఖాన ఎదుట ప్రధాన ద్వారం వద్ద నాళీపై ఏర్పాటు చేసిన గ్రిల్స్‌లో ఓ యువతి కాలు ఇరుక్కొని రెండు గంటల పాటు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. దవాఖానలో తన తల్లి చికిత్స పొందుతుండగా తనకు అల్పాహారం తీసుకువచ్చేందుకు బయటకు వచ్చిన మౌనిక ఎడమ కాలు ప్రమాదవశాత్తు గ్రిల్స్‌లో ఇరుక్కుంది. సుమారు రెండు గంటల పాటు ప్రయత్నించినా కాలు బయటకు రాకపోవడంతో స్థానికులు సమీపాన ఉన్న ఓ వెల్డింగ్ షాపు వర్కర్‌ను తీసుకువచ్చారు. రాడ్‌లను పక్కకు వంచి కాలును లాగే ప్రయత్నం చేసినా ఎంతకు కుదరకపోవడంతో తన వెంట తీసుకువచ్చిన కట్టర్ సహాయంతో రాడ్‌ను తొలగించాడు. దీనితో మౌనిక ఊపిరిపీల్చుకుంది. ఒకవైపు ఎండ దంచికొడుతుండటంతో మౌనిక తీవ్ర అవస్థను ఎదుర్కొంది. దవాఖాన కట్టినప్పుడు ఏర్పాటు చేసిన గ్రిల్స్ కావడంతో ప్రజలు, వాహనాలు రాకపోకల సమయంలో పైపులు రాడులపై తిరుగడం వల్ల అవి అరిగి పైపుకు పైపుకు మధ్య వ్యత్యాసం అధికం అయ్యిందని, అందువల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, గతంలో సైతం ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు పేర్కొన్నారు. కాగా వెంటనే మౌనికను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి వైద్యం అందించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...