ప్రాదేశిక పోరు తీన్‌మార్


Sun,April 21, 2019 12:18 AM

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(జడ్‌పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ) ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) విడుదల చేసింది. జిల్లాలో 130 ఎంపీటీసీ, 16 జడ్పీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికల నిర్వహణ కోసం ఏప్రిల్ 22వ తేదీ వరకు నోటిఫికేషన్ విడుదల చేసి అదే రోజు నుంచి ఏప్రి ల్ 24వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్లు పరిశీలించి సాయంత్రం ఐదు గంటల వరకు సక్రమంగా ఉన్న నామినేషన్లు ఫైనల్ చేస్తారు. 26న వచ్చిన అభ్యర్థుల నామినేషన్లపై ఫిర్యాదులు స్వీకరిస్తారు. 27న ఫిర్యాదులపై విచారణ చేపడతారు. ఏప్రిల్ 28 మధ్యా హ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉంటుంది. సాయం త్రం 5 గంటల వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. మే 6న ఎన్నిక ఉంటుంది. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి అదేరోజు నుంచి 28 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 29న నామినేషన్లు పరిశీలించి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు ఫైనల్ చేస్తారు. 30న వచ్చిన నామినేషన్ల అభ్యంతరాలను స్వీకరిస్తారు. మే 1న అభ్యంతరాలను పరిష్కరించిన తరువాత మే 2వ తేదీ మధ్యా హ్నం 3గంటల వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 2వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్లు ఉపసంహరణ పూ ర్తి అయిన తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. మే 10న ఎన్నిక ఉంటుంది. మూడో విడతకు నామినేషన్లు ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు స్వీకరిస్తారు. మే3న పరిశీలన, మే 4న అభ్యంతరాలు స్వీకరణ, మే 5న అభ్యంతరాలపై విచారణ, మే 6న ఉపసంహరణ, మే 14వ తేదీన ఎన్నికల ఉంటుంది.

మూడు నియోజకవర్గాలు..
మూడు విడతలు..
మొదటి విడతలో బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో 47 ఎంపీటీసీలు, ఏడు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. బెల్లంపల్లి మండలంలోని 8, భీమిని మండలంలోని 4, కన్నెపల్లి మండలంలోని 5, కాసిపేట మండలంలోని 9, నెన్నెల మండలంలోని 7, తాండూరు మండలంలోని 9, వేమనపల్లి మండలంలోని 5 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతలో చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని 37 ఎంపీసీటీలు, ఐదు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. భీమారం మండలంలో 4, చెన్నూరు మండలంలో 9, జైపూర్ మండలంలో 10, కోటపల్లి మండలంలో 9, మందమర్రి మండలంలో 5 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. మూడో విడత లో మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి 46 ఎంపీటీసీలు, నాలుగు జడ్పీటీసీలకు సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తారు. దండేపల్లి మండలం లో 14, హాజీపూర్ మండలంలో 9, జన్నారంలో 15, లక్షెట్టిపేట మండలంలో 8 ఎంపీటీలకు ఎన్నికలు జరుగుతాయి.

బ్యాలెట్ పద్ధతి ద్వారానే..
ఈ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఆల స్యం కానున్నాయి. మూడు విడతల నిర్వహించనున్న ఎన్నికలు మే 14న ముగియనుండగా, ఫలితాలను మాత్రం మే 27న ప్రకటిస్తారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మే 23న ప్రకటించిన తరువాత మే 27వ తేదీన పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించారు. ఇందుకు కావాల్సిన బ్యాలెట్ బాక్స్‌లను అందుబాటులో ఉంచారు. ఎంపీటీసీ స్థానానికి గులాబీ, జడ్పీటీసీ స్థానానికి తెలుపు రంగు పత్రాలు వినియోగించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేస్తు న్న అభ్యర్థి ఖర్చు రూ.4 లక్షలు ఎంపీటీసీగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు రూ.1.50గా నిర్ణయించగా నిర్ణయించారు. అయితే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చుల లెక్కలను బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లించాలనే నిబంధనలు విధించింది. నామినేషన్లను అన్ని మండల కేంద్రాల్లో స్వీకరిస్తారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరణ ఉంటుంది. ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఎన్నుకుంటారు. ఎంపీటీసీలు ఎంపీపీలను, జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు.

అభ్యర్థుల వ్యయ పరిమితి
పరిషత్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్లు మొదలుకుని వ్యయ పరిమితిని ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జనరల్ జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.5 వేలు, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే వారు రూ.2,500 డిపాజిట్ చేయాల్సి ఉం టుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్‌కు కేటాయించిన జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.2,500, ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.1,250 డిపాజిట్ చేయాలి. జనరల్ స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే డిపాజిట్‌లో రాయితీ ఉంటుంది. జనరల్ జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే డిపాజిట్ రూ.2,500, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు రూ.1,250 డిపాజిట్లు చేయాలి.

ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు
ఈసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించే విధానం అందుబాటులోకి వచ్చింది. నామినేషన్ పత్రాల కోసం రిటర్నింగ్ అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ముందుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. క్యాండిడెట్ పోర్టల్‌లోకి వెళ్లాలి. అందులో నాలు గు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఆన్‌లైన్ నామినేషన్ ఫర్ రూర ల్ బాడీస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఎంపీటీసీ స్థానానికి, జడ్పీటీసీ స్థానానికి ఆన్‌లైన్ నామినేషన్ సమర్పించేందుకు ఆప్షన్ చూపెడుతుంది. ఏ అభ్యర్థి ఏ పదవికి పోటీ చేస్తున్నారో దాని ని ఎంచుకుని ఆన్‌లైన్‌లోనే వివరాలు నమోదు చేయాలి. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో ఏమో దు చేసే వెసులుబాటు ఉన్నది. ఆస్తులు, ఇతరపత్రాలు పీడీఎఫ్ ఫైల్ రూపంలో అప్‌లోడ్ చేసిన తర్వాత సబ్‌మిట్ నామినేషన్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ కాపీని ప్రింట్ తీసుకుని కచ్ఛితంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. కేవలం ఆన్‌లైన్ సబ్‌మిషన్ నామినేషన్ పరిగణలోకి తీసుకోరాదని ఎన్నికల సంఘం తెలిపింది. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆన్‌లైన్ నామినేషన్ అమలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ఈ పద్ధతిని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

141
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...