కలెక్టర్‌కు చెప్పుకో..


Sun,April 21, 2019 12:18 AM

భీమారం : నా పేరు పిట్టల రాజం.. మా తండ్రి పేరు పోశం. మాకు భీమారం శివారులోని సర్వే నంబర్ 12/2ఎఎ లో 3 ఎకరాల 5 గుంటలు భూమి ఉంది. మా తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తుంది. గతేడాది క్రితం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ అధికారులు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకపోగా.. ఆన్‌లైన్ నుంచి సర్వే నంబర్‌ను తొలగించారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నా భూమి ఆన్‌లైన్ కనిపించడం లేదని అడుగగా.. సర్వేయర్ మోకాపైకి వచ్చి భూమి సర్వే చేసిండు. ఏడాది అవుతున్నా న్యాయం జరగలేదు. అప్పటి నుంచి తాసీల్దార్ కార్యాలయం చూట్టూ గిర్రగిర్ర తిరుగుతున్న. అప్పుడు అయితది.. మల్లరా.. రేపు వచ్చి కలువు.. పది రోజుల తర్వాత కలువు అంటూ.. ఏడాది గడిపిండ్రు. గతేడాది మద్దికల్ శివారు రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట టెంటు వేసుకుని ధర్నా లు చేయగా.. అందులో పాలుపంచుకున్నందు కు కుట్ర పూరితంగా నా సర్వే నంబర్‌ను ఆన్‌లైన్ నుంచి అప్పటి వీఆర్వో తొలిగించింది. అప్పటి తహసీల్దార్ భూమేశ్వర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకో నాకు భయం లేదని మాట్లాడాడు.

పట్టా యాజమాన్య హక్కు ఇచ్చి తొలిగించిండ్రు. పాత పాస్ పుస్తకంపై 25 ఏండ్లుగా పంట రుణం కూడా తీసుకున్న. తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రైతుబంధు చెక్కు, కొత్త పాస్ పుస్తకాలు వస్తాయని అనుకున్న. కానీ.. రెవెన్యూ అధికారుల తీరుతో నాకు రైతుబంధు చెక్కు రాకపోగా ఆన్‌లైన్ నుండే నా పేరును తొలిగించి వేరే వారికి పట్టాలు చేశారు. దీంతో తెలంగాణ సర్కారు రెండు విడుతలుగా ఇచ్చిన రైతుబంధు రూ.24 వేలు కోల్పయా. అంతేకాక ప్రతి సంవత్సరం తీసుకునే బ్యాంక్‌లో క్రాఫ్ లోన్‌ను కోల్పోయిన. భీమారంలో తహసీల్దార్ కార్యాలయం ఏర్పా టు కావడంతో సమస్యలు ఎక్కువ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కార్యాలయలు ఏర్పాటు అయితే రైతుల సమస్యలు పరిష్కరం అయితాయి అనుకుంటే, లంచగొండి అధికారులతో రైతుల సమస్యలు ఎక్కువయ్యాయి. దయచేసి నాకు న్యాయం చేయండి. ధర్మగంటతో నాకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్న..

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...