న్యాయం చేస్తాం..


Sun,April 21, 2019 12:17 AM

తాండూర్ : రైతు బాయక్క భూసమస్యపై అయ్యా దండం పెడతా.. శీర్షికన నమస్తేతో శుక్రవారం ప్రచురితమైన కథనంతో రెవెన్యూ అధికారుల్లో కదలిక వచ్చింది. రికార్డుల్లో భూమి ఉన్నట్లు చూ పుతున్నా.. పాసు పుస్తకాలు ఇవ్వకపోవడంపై ఆమె రెండేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతు న్నా పట్టించుకోని వైనాన్ని ఎత్తిచూపడంతో స్పం దించిన అధికారులు శనివారం ఆ రైతును వెతుక్కంటూ ఇంటికి వెళ్లారు. ఆర్‌ఐ ప్రభులింగం, సర్వేయర్ కృష్ణప్రియ, వీఆర్వో దేవాజీలు మోఖాపైకి బాయక్కతో కలిసి వెళ్లి భూమిని పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

తాండూర్ మండల కేంద్రానికి చెందిన బాయక్క అనే మహిళా రైతు తనకు కొత్త పట్టా పాసుబుక్కులు ఇవ్వాలని గత సంవత్సర కాలం గా తాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. రైతు పడుతున్న కష్టంపై నమస్తే తెలంగాణలో జిల్లా సంచికలో శుక్రవారం అయ్యా.. దండం పెడతా శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. సర్వే నంబర్ 774 బదులు, సర్వే నంబర్ 90లో బాయక్క కాస్తుకు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అధికారుల తప్పిదం వల్ల బాయక్క నష్టపోయినట్లు స్పష్టమవుతోంది. పూర్తి నివేదికను మండల తహసీల్దార్‌కు అందించి నూతన పట్టా పాసుబుక్కులు వచ్చేలా చూస్తామని మోఖాపైకి వచ్చిన అధికారులు స్పష్టం చేస్తున్నారు.

నమస్తేకు రుణపడి ఉంటా..
- బాయక్క, బాధిత రైతు
తాండూరు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 774-2లో మా వంశపారంపర్యంగా 2.38 ఎకరాల భూమి పట్టాగా వస్తోంది. అందుకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. తాత ముత్తాతల నుంచి తమ పేరు మీదే భూమి ఉన్నట్లు రికార్డులు చూపుతున్నా నాకు భూమి లేదని కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. రెండు సంవత్సరాల కాలంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. ఆన్‌లైన్‌లో పేరు మారలేదంటూ.. నీ పేరు మీద భూమే లేదు. ఆ భూమి వేరే వారిది అంటూ తిప్పించుకుంటున్నారు. దండం సారూ.. అది మా భూమి. కాయాకష్టం చేసుకొని బతికేటోళ్లం అన్నా మా గోడు వినలేదు. సమస్య పరిష్కారం కాలేదు. అడుగకుండానే నా దగ్గరకు వచ్చి నా సమస్యను తెలుసుకుని భూమిని చూపించేలా చేసిన నమస్తే తెలంగాణకు రుణపడి ఉంట. మీ మేలు ఎప్పటికీ మరచిపోలేను. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న నాలాంటి రైతుల సమస్యలను కూడా పరిష్కరించాలి.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...