అంకిత భావంతో పనిచేయాలి


Sun,April 21, 2019 12:17 AM

శ్రీరాంపూర్ : సింగరేణిలో చేరిన నూతన ఉద్యోగులు సంస్థపై అంకిత భావంతో పని చేయాలని శ్రీరాంపూర్ ఏరియా ఇన్‌చార్జి జీఎం సత్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాలో మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ ద్వారా కారుణ్య ఉద్యోగాలు పొందిన కారుణ్య ఉద్యోగాలు పొందిన 68 మందికి జీఎం కార్యాలయంలో శనివారం కారుణ్య నియామక పత్రాలు అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారుణ్య ఉద్యోగాలు పొందిన యువకులు సంస్థపై అంకిత భావంతో పని చేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఇప్పటి వరకు శ్రీరాంపూర్ ఏరియాలో మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ అయిన కార్మికుల పిల్లలకు 663 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. శ్రీరాంపూర్ ఎంవీటీసీలో శిక్షణ ఇస్తామన్నారు. నూతనంగా వీటీసీ శిక్షణకు 68 మందికి లేఖలు ఇచ్చామని తెలిపారు. యువకులు రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకతకు కృషి చేయాలని కోరారు. సీనియర్ కార్మికుల అనుభవాన్ని చూసి వారి మార్గదర్శనంలో పని చేయాలని కోరారు. గైర్హాజరు కాకుండా క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఎం జీవీ కిరణ్‌కుమార్, పైనాన్స్ మేనేజర్ రాజం, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కేహెచ్‌ఎన్ గుప్తా, పీఎం తుకారాం పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...