గూడెంలో చైత్ర పౌర్ణమి జాతర


Fri,April 19, 2019 11:50 PM

దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో శుక్రవారం చైత్ర పౌ ర్ణమి జాతర ఘనంగా నిర్వహించారు. ఉదయా న్నే ఆలయానికి చేరుకున్న భక్తులు సమీప గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. గుట్టపైను న్న సత్యదేవుడిని దర్శించుకున్నారు. విద్యా సంస్థలకు వేసవి సెలవులు రావడం, హనుమాన్ జ యంతి కావడంతో భక్తులు ఉదయం అధిక సం ఖ్యలో తరలివచ్చారు. వేల సంఖ్యలో హాజరైన భక్తులకు ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పించారు. ఆలయంలో పలువురు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. దీంతో ఆలయం వద్ద భక్తుల సందడి కనిపించింది. దర్శనం అనంతరం భక్తులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించా రు. హనుమాన్ జయంతి కావడంతో గుట్టపై ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...