ఘనంగా గుడ్ ఫ్రైడే


Fri,April 19, 2019 11:49 PM

మంచిర్యాల రూరల్ : గుడ్ ఫ్రైడే వేడుకలలో భాగంగా హాజీపూర్ మండలంలోని చర్చిలలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దొనబండలోని వెస్లీ చర్చీలో పాస్టర్ ఎం డేవిడ్ బైబిల్ సూక్తులను ప్రబోధించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ వేడుకలలో పాస్టర్ శ్రీకాంత్, రాజారావు, సభ్యులు రవి, ప్రశాంత్, విజయ్, సుమన్, శ్రీనివాస్ ఉన్నారు. 40 రోజులుగా చేస్తున్న క్రైస్తవ ఉపవాస దీక్షలు శుభ శుక్రవారంతో ముగిశాయి.

సీసీసీ నస్పూర్ : సీసీసీ సీఎస్‌ఐ చర్చిలో సంఘ కాపరి రెవ డీ మధుకుమార్ పరిపూర్ణమైన రక్షణ కార్యం అనే అంశంపై ప్రబోధించారు. ప్రార్థన అనంతరం యూత్ సభ్యులచే అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్ట్రేట్ స్టువర్ట్ విటేకర్, పాస్ట్రేట్ కార్యదర్శి అనిల్‌రాజ్, కమిటీ, యూత్ సభ్యులున్నారు.

దండేపల్లి : దండేపల్లి సీఎస్‌ఐ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తును స్తూతిస్తూ గీతాలాపన చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెవ ఏఆర్ సాల్మన్‌రాజ్, క్రైస్తవులున్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...