కాయ్ రాజా కాయ్


Fri,April 19, 2019 02:33 AM

నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మండు వేసవిలోనూ నిండుగా పందెం రాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నారు. మార్చి 23వ తేదీన ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభమై మే 12వ తేదీన ముగియనుంది. అదేవిధంగా మార్చి 18న పార్లమెం ట్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో జరగనున్న ఎన్నికలు మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ లో మొదటి విడతలోనే ఎన్నికలు ముగిశాయి. ఏప్రి ల్ 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఫలితాలకు 41 రోజుల గడువు ఉండటంతో నిరీక్షణ తప్పడం లేదు. ఇదే సమయంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఉద యం నుంచి రాత్రి వరకు కొనసాగుతుండడం, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిసి అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. క్రికెట్ మ్యాచ్, అభ్యర్థుల గెలుపోటములపై పందెం రా యుళ్లు జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు. ఎండలు 44.5 డిగ్రీలకు చేరుకున్నాయి. ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్లడం లేదు. అందరి చేతుల్లో మొబైల్స్ ఉండడం, నెట్ కూడా అందుబాటులో ఉండటంతో ఆన్‌లైన్‌లో దందా హోరుగా సాగిస్తున్నారు.

కారు అభ్యర్థులే అధికంగా గెలుస్తారు..
ఏప్రిల్ 11వ తేదీన లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. అన్ని విడతల ఎన్నికలు పూర్తయ్యాకే ఫలితాలు ప్రకటించనున్నారు. మే 23న ఫలితాలు ప్రకటించనుండగా.. ఫలితాలపై జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంతోపాటు రాష్ట్రంలోని ప్రముఖులు పోటీ చేసిన స్థానాలపై పందేలు కాస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి? ఏ పార్టీ ఏ స్థానంలో ఉంటుంది? కేంద్రం లో ఏ కూటమి అధికారంలోకి వస్తుంది? రాజకీయ పార్టీ అభ్యర్థి గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? అనే అంశాలపై జోరుగా పందెం కాస్తున్నారు. అధిక శాతం కారు గుర్తే గెలుస్తుందని, బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తారని బెట్టింగ్ కాస్తున్నారు. రూ.లక్షకు రూ.లక్ష ఇస్తామంటూ పందెం రాయుళ్లు బెట్టింగ్ పెడుతున్నారు. గతంలో ఈ పందెం పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యేది. ప్రస్తుతం గ్రామాలకు పాకింది. ప్రతి గ్రామంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జోరుగా చర్చ నడుస్తోంది.

వాట్సప్‌లో పందేలు..
ఐపీఎల్‌పై కూడా జిల్లాలో జోరుగా పందెం దందా నడుస్తోంది. ఏ టీం గెలుస్తుంది? పది ఓవర్లలో ఎన్ని పరుగులు చేస్తారు? ఎన్ని ఓవర్లలో లక్ష్యం చేరుతారు? ఏ క్రికెటర్ ఎన్ని పరుగులు చేస్తారు? ఈ ఓవర్లో సిక్స్‌లు, ఫోర్‌లు ఎన్ని కొడుతారు? అనే వాటిపై బెట్టింగ్ నడుస్తోంది. లోక్‌సభ, ఐపీఎల్ బెట్టింగ్ ఎక్కువగా ఆన్‌లైన్‌లో నడుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు లు ఏర్పాటు చేశారు. గతంలో ఫోన్లలో, ఒక ప్రదేశంలో బెట్టింగ్ నిర్వహించేవారు. ప్రస్తుతం వాట్సప్‌లో గ్రూపులు ఏర్పాటు చేసి పందెం కాస్తుండటంతో సులువుగా మారింది. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి ప్రతి ఓవర్‌పైన కూడా పందెం కాస్తున్నారు. డబ్బులకు సంబంధించి కోడ్ భాష పెట్టుకుంటున్నారు. 2కె, 3కె, 5కె (కె=1000) అంటూ ఫోన్లలో కాల్స్, వాట్సప్‌లో మెసెజ్‌ల రూపంలో పందెం దందా నడుస్తోంది. లోక్‌సభ ఫలితాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గెలిచేదెవరో? ఓడెదెవరో? మే 23న తేలనుండగా.. పందెంరాయుళ్లలో లాభపడెదెవరో? నష్టపోయేదెవరో? అప్పుడే తేలనుంది.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...