రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తాం..


Fri,April 19, 2019 02:32 AM

మంచిర్యాల అగ్రికల్చర్ : రైతులకు సంబంధించి ఎలాంటి భూ సమస్యలున్నా పరిష్కరిస్తామనీ, వారికి అండగా నిలుస్తామని హాజీపూర్ తహసీల్దార్ డీ పుష్పలత పేర్కొన్నారు. గురువారం హాజీపూర్ మండలం కర్ణమామిడి పునరావాస కాలనీలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ రికార్డుల పరిశీలి స్తూ భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. ఈ సందర్భంగా కర్ణమామిడి, కొండపల్లి గ్రామాలకు చెందిన 65 మంది రైతుల నుంచి భూ సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించడంతోపాటు పంచాయతీ కార్యాలయానికి వచ్చిన పలువురి నుంచి భూ సమస్యలు తెలుసుకున్నారు. పలువురు రైతుల దరఖాస్తులను పరిశీలించి వారి చెప్పిన ఫిర్యాదులను తెలుసుకొని మరీ భూ రికార్డులను చూస్తూ అక్కడికక్కడే దాదాపు 25 మంది రైతుల సమస్యలు నేరుగా పరిష్కరించారు.

మరికొంత మంది జాయింట్ పట్టాకు సంబంధించి ఫిర్యాదు లు రావడంతో పాటు ఉన్న జాయింట్ పట్టాలను వేర్వేరుగా విరాసత్ చేయాలని వచ్చిన దరఖాస్తుల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపారు. భూ వివాదాలుంటే అక్కడికక్కడే పరిష్కరించి విరాసత్ చేసేలా చూశారు. రెవెన్యూ రికార్డుల ప్రకారమే కాకుండా రైతులు చెప్పిన వివరాలతో పాటు వారికి సంబంధించిన భూ వివరాలను సైతం కంప్యూటర్ రికార్డుల్లో నమోదు చేశారు. సాధారణ రికార్డుల్లో నూ సరి చేశారు. ముఖ్యంగా రైతులు భూ సమస్య లు ఉన్న వారు, జాయింట్ పట్టా సమస్యలు, విరాసత్ సమస్యలు ఉన్న వారు తన దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్ సూచించారు. ఈ కార్యక్రమం లో కర్ణమామిడి సర్పంచ్ కొట్టె మధూకర్, గిర్దావర్ రాయలింగు, వీఆర్‌ఓ రమేశ్, సర్వేయర్ మధూకర్‌రెడ్డి, వీఆర్‌ఏలు, రైతులు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...