అనుమతి లేనివి అమ్మితే చర్యలు


Fri,April 19, 2019 02:32 AM

మంచిర్యాల అగ్రికల్చర్ : జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి వుల్లోజు వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురు వారం జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో జిల్లాలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ప్రైవేటు కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఏఓ మాట్లాడారు. నకిలీ విత్తనాలు(హర్బిసైడ్ టాలరెంట్ బీటీ పత్తి విత్తనాలు), అనుమతి లేని ైగ్లెఫోసెట్ కలుపు నివారణ మందులు అమ్మడం, కొనడం కూడా నేరమేనన్నారు. వీటిని తమ వద్ద ఉంచుకున్నా చట్టరీత్యా నేరమేనన్నారు. వీటి వలన కలిగే నష్టాలను వివరించారు. అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏడీఏలు శ్రీనివాస్, బాపు, ఏఓలు క్రిష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి
తాండూర్ : రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయాధికారి బీ వినోద్‌కుమార్ అధికారులకు సూచించారు. గురువా రం మండల వ్యవసాయశాఖ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. మండలంలో కొనసాగుతున్న రైతు సమగ్ర సమాచార సేకరణ జరిగే విధానం, వివరాలను మండల వ్యవసాయాధికారి కిరణ్మయిని అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల వరకు సర్వే చేసి రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా రైతులు బీటీ-3 పత్తి విత్తనాలను వాడవద్దనీ, ఈ విత్తనాలకు ప్రభుత్వం అనుమతి లేదని, దీని ద్వారా ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయని రైతులకు తెలిపారు. బీటీ-2 పత్తి విత్తనాలనే వాడాలనీ, లైసెన్స్ కలిగి ఉన్న ఎరువుల దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను కొనాలని సూచించారు. జిల్లా వ్యవసాయ కార్యాలయ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనివాస్, ఏఈఓలు శంకర్, పుష్పలత, నిహారిక పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...