ఉచిత పాఠ్య పుస్తకాలొచ్చాయ్..


Fri,April 19, 2019 02:32 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బుక్‌డిపోకు చేరుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభించిన రోజునే పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు పుస్తకాలపై కోడ్ నెంబర్లు ఏర్పాటు చేశారు. గతేడాది నుంచే ఈ విధానం అమలులోకి వచ్చింది. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభం రోజునే పుస్తకాలను అందజేస్తున్నది.

పాఠశాలలు 832, విద్యార్థుల సంఖ్య 59,946
జిల్లాలో 832 ప్రభుత్వ పాఠశాలలుండగా అందులో రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ స్కూల్స్ 709,మోడల్ స్కూల్స్ 5, కస్తూర్బా గాంధీ స్కూల్స్ 18,టీఆర్‌ఈఐఎస్ స్కూల్స్ 2, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 9, ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ స్కూల్స్ 2, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ స్కూల్స్ 67, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 3, మైనారిటీ వెల్ఫేర్ గురుకులాలు 3, ఎయిడెడ్ స్కూల్స్ 14 ఉన్నాయి. ఇందులో 59946 మంది విద్యార్థిని, విద్యార్థులు చదువుతున్నారు.

జిల్లాలో పుస్తకాలు 3,70,544 అవసరం..
18 మండలాల్లో 832 పాఠశాలల్లో 59946 మంది విద్యార్థులకు 3,70,544 పుస్తకాలు కావాల్సి ఉంది. గతేడాది 45199 పుస్తకాలు మిగిలి ఉన్నాయి. 1,70, 185 పుస్తకాలు పది రోజులుగా జిల్లాకు చేరుకున్నాయి. ప్రస్తుతం బుక్‌డిపోలో 2,15,384 పుస్తకాలు ఉన్నా యి. 1,55,160పుస్తకాలు జిల్లాకు రావాల్సి ఉంది.

26 నుంచి మండలాలకు పుస్తకాల పంపిణీ
ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు జిల్లాలోని 18 మండలాలకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని డీఈఓ అదేశించినట్లు బుక్‌డిపో మేనేజర్ రాజేందర్ తెలిపారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...