ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల ప్రతిభ


Fri,April 19, 2019 02:32 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : ఇంటర్ ఫలితా ల్లో ప్రభుత్వ జునియర్ కళాశాలల విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు. జన్నారం ప్రభుత్వ జునియర్ కళాశాల విద్యార్థి పయ్యావుల మహేశ్ ఎంపీసీలో 958 మార్కులు, పీ రమ్య హెచ్‌ఈసీలో 932 మార్కులు సాదించింది. చెన్నూర్ ప్రభుత్వ జునియర్ కళాశాల విద్యార్థిని జీ సాయిరమ్య సీఈసీలో 899 మార్కులు సాధిం చిందని డీఐఈఓ ఇంద్రాణి తెలిపారు.

గురుకుల విద్యార్థుల విజయదుందుభి
లక్షెట్టిపేట : ఇంటర్ ఫలితాల్లో లక్షెట్టిపేట సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిం చి విజయబావుటా ఎగురవేసినట్లు ప్రిన్సిపాల్ ఎం లలిత కుమారి గురువారం తెలిపారు. ద్వితీయ సంవ త్సరంలో కళాశాల నుంచి 71 మంది పరీక్షకు రాయగా 69 మంది (97 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. ఎంపీసీలో వీ స్వప్న 970 మార్కులు, ఎన్ రాజ్యలక్ష్మి 957 మార్కులు, ఆర్ కేశవతి 940 మార్కులు, బైపీసీ లో ఎస్ సాయిభావన 973 మార్కులు, ఎస్ స్నేహ 967 మార్కులు, ఏ రవళి 945 మార్కులు సాధించా రని పేర్కొన్నారు. 69 మంది విద్యార్థుల్లో 23 మందికి 900 మార్కులకుపైగా సాధించారన్నారు. ఇంటర్ మొద టి సంవత్సరంలో 69 మంది విద్యార్థులు పరీక్ష రాయ గా 63 మంది (91 శాతం) ఉత్తీర్ణులయ్యారన్నారు. ఎంపీసీలో ఏ సమ్మక్క 452 మార్కులు, బైపీసీలో మమత 400 మార్కులు సాధించారన్నారు. 400మా ర్కులకు పైగా ఎనిమిది సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపా రు. ఉత్తీర్ణులైన విద్యార్థులను కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కే మహేశ్వర్ రావు, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎస్ శ్రీలత, అధ్యాపకులు అభినందించారు.

దండేపల్లిలో..
దండేపల్లి : దండేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి సాధించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థి కే అమూల్య(బైపీసీ-896) మా ర్కులు సాధించింది. లింగాపూర్ ఆదర్శ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న గోపతి సంయుక్త(ఎంపీసీ-917), గంజా యిల ఆకాంక్ష నేత(బైపీసీ-910), జాడి అనూష (సీఈ సీ-896)మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం లో బాలసాని అనూష(424-సీఈసీ), అఖిలా(415-ఎంపీసీ), నవీత(369-బైపీసీ) మార్కులు సాధించా రు. మొదటి సంవత్సరంలో 109 మంది పరీక్షలు రాయగా 40 మంది పాసయ్యారు. 37 శాతం, ద్వితీయ సంవత్సరంలో 113 మంది పరీక్షలు రాయగా 73 మం ది పాసవ్వగా, 65 శాతం ఉత్తీర్ణత సాధించారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...