ఆశావహుల జాతర


Thu,April 18, 2019 12:07 AM

నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో 567ఎంపీటీసీ స్థానాలు, 66 జడ్పీటీసీ స్థానాలు, 66 ఎంపీపీ పదవులు, నా లుగు జిల్లా పరిషత్ చైర్మన్ పదవులున్నాయి. గతం లో 636 ఎంపీటీసీ స్థానాలు, 52 జడ్పీటీసీ, 52 ఎంపీపీ పదవులు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత పూర్వ ఆదిలాబాద్ జిల్లా.. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలుగా ఆవిర్భవించా యి. దీంతో నాలుగు రెవెన్యూ జిల్లాల ప్రకారం నా లుగు జిల్లా పరిషత్తులు ఉండేలా ఇటీవల రాష్ట్ర ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు 52 మండలాలు ఉండగా.. కొత్తగా 18 మండలాలు ఏ ర్పాటు చేశారు. ఇందులో నాలుగు అర్బన్ మండలాలు ఉండగా.. 66 గ్రామీణ మండలాలు ఉన్నా యి. పాత వాటికి మండల పరిషత్ పాలకవర్గాలు ఉండగా.. కొత్తగా ఏర్పడిన 14 గ్రామీణ మండలాలకు కూడా రెవెన్యూ మండలాల ప్రకారం ఇటీవల మండల పరిషత్‌లు ఉండేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈసీ, సర్కరు ఎన్నికలపై నజర్
జిల్లా పరిషత్‌లకు జూలై 5, మండల పరిషత్‌ల కు జూలై 4లోగా కొత్త పాలక వర్గాలు రావాల్సి ఉం ది. ఈ నేపథ్యంలో గడువులోపే ఎన్నికలు పూర్తి చే సి.. కొత్త పాలక వర్గాలు కొలువుదీరేలా ఈసీ, ప్రభు త్వం దృష్టి సారించాయి. చిన్న జిల్లాలు కావడం.. కొత్త మండలాలు ఏర్పాటు కావటంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు పోటీ తీవ్రంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 17, నిర్మల్ జిల్లాలో 18, మంచిర్యాల జిల్లాలో 16, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లో 15 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నిక కావాలంటే 8 నుంచి 9 మంది జడ్పీటీసీ సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే సగం మంది సభ్యులు.. 26 నుంచి 27 మంది జడ్పీటీసీ సభ్యుల మద్దతు అవసరం ఉండేది. తాజాగా ఇందులో మూడొంతుల మంది సభ్యుల మద్దతుంటే సరిపోవటంతో.. అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. అదీకాక కొత్త మండలాలు ఏర్పాటు చేయగా.. మండలాల విస్తీ ర్ణం కూడా తగ్గింది. దీంతో గ్రామాల సంఖ్య తగ్గడంతో జడ్పీటీసీ సభ్యునిగా గెలవటం కూడా సులభంగా మారింది.

పోటీకి ఆసక్తి
ఎంపీపీ పదవులకు సంబంధించి.. గతంలో ఎ క్కువ మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు కూడగట్టా ల్సి వచ్చేది. 3,500 నుంచి 4 వేల జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేయగా.. ఉమ్మడి జిల్లాలో వీటి సంఖ్య తగ్గింది. అయితే కొత్త మండలాలు ఏర్పాటు కావటంతో.. చాలా మండలాల్లో గ్రామ పంచాయతీలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. దీంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. మావల మండలంలో 3 ఎంపీటీసీ స్థా నాలు, పెంబి, భీమారం, పెంచికల్‌పేట్, భీమిని, లింగాపూర్, సిర్పూర్(యు) మండలాల్లో కేవలం నాలుగు చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. దస్తురాబాద్, కన్నెపల్లి, తాంసి, వేమనపల్లి, మందమర్రి చొప్పున.. బాసర, దిలావర్‌పూర్, గాదిగూడ, సిరికొండ మండలాల్లో 6 చొప్పున ఎంపీటీసీ స్థానా లు ఉన్నాయి. దీంతో మావల వంటి మండలాల్లో ఇద్దరు ఎంపీటీసీ మద్దతు ఉంటే ఎంపీపీ పదవి దక్కించుకోవచ్చు. చాలా చోట్ల 2-3 మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు ఉంటే సరిపోతోంది. మెజారిటీ మండలాల్లో 4-5మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు ఉంటే ఎంపీపీ పదవి కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. దీంతో నాలుగు జిల్లాల్లోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవులకు తీవ్రంగా పోటీ నెలకొంది. తాము పోటీ చేసే ఎంపీటీసీ స్థానంలో గెలిస్తే.. ఎంపీపీ అయ్యేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు జడ్పీటీసీ సభ్యునిగా గెలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కించుకోవచ్చనే భావనతో పెద్ద సంఖ్యలో ఆశావహులు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆసక్తి చూపుతున్నారు.

మద్దతు కోసం ప్రయత్నాలు
ముఖ్యంగా అధికార పార్టీలోనే పోటాపోటీ నెలకొంది. ఇటీవల అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగడం.. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండడం.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో పూర్తి సానుకూలత ఉండటం ఇం దుకు కారణంగా చెప్పవచ్చు. అధికార పార్టీ నుంచి టికెట్ దక్కించుకుంటే.. తమ గెలుపు సగం ఖాయమైనట్లేనని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జీగా అల్లోల ఇంద్రకర్‌రెడ్డికి నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలు, జోగు రామన్నకు ఆదిలాబాద్ జిల్లా అప్పగించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో ఆశావహులు అధికార పార్టీలో ఎక్కువగా ఉన్నారు. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని భావించి.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ఇటీవల అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం చెందటం.. ప్రజల్లో ఆశించిన మేర అనుకూల స్పందన లేకపోవటంతో వెనకడుగు వేస్తున్నారు. అదీకాక ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆర్థికంగా భారం కావటం నిరాసక్తత కనిపిస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పార్టీ నుంచి ఆర్థికంగా ఏమైనా వస్తే.. ఇస్తే.. మాత్రమే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...