పాస్ పుస్తకం ఇస్తలేరు..


Thu,April 18, 2019 12:06 AM

నెన్నెల : ఫొటోలో కనిపిస్తున్న బక్క చిక్కిన రైతు ఈగం శంకరయ్య. తన తండ్రి పోచయ్య పేరిట ఉన్న భూమి కోసం నాలుగేండ్లుగా తిరుగుతున్నా అధికారులు కనికరించడం లేదు. నెన్నెల మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన శంకరయ్యకు మెట్‌పల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 69లో 3.14 ఎకరాల భూమి ఉంది. ఇట్టి భూమిలో ఇతరులు వ్యవసాయం చేసుకుంటున్నారు. భూమి ఉన్నప్పటికీ పాస్ బుక్కు లేదు. భూమి ఉందన్న మాటే గానీ పంట రుణం, రైతు బంధు రావడం లేదు. తనకు భూమి ఉందని పాత రికార్డులు చూపిన అధికారులు సర్వే చేయడం లేదు. నా భూమి ఏదని అడిగితే భూమేలేదని బుకాయిస్తున్నారు. పాత రికార్డులు అన్ని చూపిన పోచయ్య భూమి కాదంటున్నారు. చివరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే పాత రికార్డులు అన్ని ఇచ్చిండ్రు. అందులో పోచయ్య భూమని ఉంది కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన వారసులకు పాస్‌బుక్కు మాత్రం ఇవ్వడం లేదు. కొత్త పాస్ బుక్కు కోసం ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. నెన్నెల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి అధికారుల కోసం రోజు ఎదురు చూస్తున్నాడు.

1974 నుంచి ఇప్పటివరకు ఈగం పోచయ్య పేరిటనే రికార్డులలో ఉంది. మ్యూటేషన్ చేసి పాస్ బుక్ ఇవ్వమంటున్నాడు. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూ రికార్డుల ప్రక్షళనలో కూడా పోచయ్య భూమిని అధికారులు పట్టించుకోలేదు. ఇదేంటని అధికారులను అడిగితే లేని పోని సమాధానాలు చెప్పడం తప్పా ఆయనకు న్యాయం చేయలేదు. మొదట భూమేలేదన్నారు. 2016లో తన భూమికి సంబంధించిన వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. అందులో కూడా పోచయ్య పేరిట ఉన్నది. కానీ అధికారులు మాత్రం పట్టించుకొవడం లేదని శంకరయ్య వాపోతున్నారు. రెండు సార్లు అధికారులు వెరిఫికేషన్‌కు చేసి వెళ్లారు. అయిన భూమికి సంబంధించిన పాస్ బుక్ ఇవ్వడం లేదు. పోచయ్య పేరిట ఉన్న భూమి కోసం శంకరయ్య నాలుగు ఏండ్లుగా తిరుగుతున్నాడు. భూమి ఎక్కడుందో చూపించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేశాడు. సర్వే చేసి భూమికి హద్దులు పాతాలని సర్వేయర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. రెండు సార్లు వచ్చిన సర్వేయర్‌లు రాజకీయ జోక్యంతో కొలతలు పెట్టడం లేదు. ఉన్న భూమిలోనే సాగు చేద్దామన్న ఇతరులు అక్కడికి రానివ్వడం లేదు. సర్వే చేసి పట్టా దార్ పాస్ బుక్కు ఇవ్వాలని అధికారులను శంకరయ్య కోరుతున్నాడు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...