లారీ, ట్యాంకర్ ఢీ.. నలుగురికి గాయాలు


Thu,April 18, 2019 12:05 AM

జైపూర్: పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ కేం ద్రం సమీపంలో మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో సిమెంట్ ట్యాంకర్, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయపడ్డా రు. ఎస్‌ఐ విజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్ నుంచి శ్రీరాంపూర్ వెళ్తున్న టిప్పర్ చెన్నూర్ వైపు సిమెంట్ డస్ట్‌తో వెళ్తున్న ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవ ర్ ఖైరీగూడకు చెందిన ఎస్‌కే మాజీద్‌కు గాయాలవగా, లారీలోని వెంగల కిరణ్ కుమార్, వెంగల మ ల్లేశ్, శ్రీరాముల భరత్‌కు గాయాలయ్యాయి. లారీలోని వారంత బెల్లంపల్లికి చెందిన వారు. గాయపడ్డ వారిని 108లో మంచిర్యాల దవాఖానకు తరలించారు. లారీని క్లీనర్ వెం గల కిరణ్‌కుమార్ నడుపుతున్నాడు. ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...