టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు


Mon,March 25, 2019 01:39 AM

బెల్లంపల్లినమస్తే తెలంగాణ : బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షం లో భారీగా టీఆర్‌ఎస్‌లో చేరారు. బెల్లంపల్లి పట్ట ణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సుక్కు సదయ్య, కాసిపేట మండలం దేవాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వాల్మీకి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంది వెంకటరమణ, డీసీసీబీ డైరెక్టర్ బొర్లకుంట ప్రభాకర్ తమ అనుచరులతో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వారికి గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బంగారు తెలంగాణ సాధనకు పాటుపడుతాదామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మండల సమన్వకమిటీసభ్యులు జాడి రాంచందర్, అగ్గి వెంకటేశ్వ ర్లు, దేవాపూర్ టౌన్ అధ్యక్షుడు పురుషోత్తం, పల్లెమల్లన్న శ్రీనివాస్ పాల్గొన్నారు.

కలమడుగులో 50 మంది..
జన్నారం : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఆదివారం జన్నారం మండలం ఇందన్‌పల్లి, మురిమడుగు, వెంకట్రావుపేట గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అనంతరం కలమడుగు గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 50మంది ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెడాం నగేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...