టీఆర్‌ఎస్ సత్తాచూపుదాం


Mon,March 25, 2019 01:38 AM

మంథని, నమస్తే తెలంగాణ (పెద్దపల్లి జిల్లా): పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో టీఆర్‌ఎస్ సత్తా చూపాలనీ, మరోసారి గులాబీ అభ్యర్థికి పట్టంకట్టాలని రాష్ట్ర సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అధ్యక్షతన జరిగిన మంథని నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై, మాట్లాడారు. ముం దుగా పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్ నేతను మంథని నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పరిచయం చేసి, మాట్లాడారు. తెలంగాణ మొత్తంలో కారు గాలీనే, కేసీఆర్ గాలీనే వీస్తున్నదని చెప్పారు. తెలంగాణ ఉద్యమ పుణ్యమా ఉద్యమ నేత బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ర్టానికి వరంలాగా లభించారన్నారు. తెలంగాణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక గొప్ప విజన్ ఉందనీ, ఆయన నాయకత్వం దేశానికి అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇంకా రాష్ట్రంలోని 16పార్లమెంటు స్థానాలు ఖాయంగా కనిపిస్తున్నదనీ, క్లీన్‌స్వీప్ చేస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందనీ, విషయమై కార్యకర్తలు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలన్నారు.

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్ నేతను మంథని నియోజకవర్గం నుంచి 60వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలన్నారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను మంథని నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే వారికి ఒక కొడుకులా.. అన్నలా.. తమ్ముడిలా సేవ చేస్తానని వెంకటేశ్ నేత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తాను ఒక విద్యార్థిగా, ఉద్యోగిగా సేవలందించాననీ, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసే పార్టీలోకి వచ్చానన్నారు. తనను ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన ఆయనకు, అధిష్ఠానానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో వినూత్నంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ దేశంలోని 29రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ప్రధాన మంత్రిగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో 16ఎంపీ సీట్లు గెలిస్తే మనమే కింగ్ అనీ, అన్ని స్థానాలను గెలిపించి దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం ఉందనే విషయాన్ని చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమ నాయకుడు వెంకటేశ్‌నేతను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...