ముగిసిన చండీయాగం


Mon,March 25, 2019 01:38 AM

కోటపల్లి : కోటపల్లిలోని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ స్వగృహంలో చేపట్టిన చండీయాగం ఆదివారం ముగిసింది. జగద్గురువు శృంగేరి పీఠాధిపతి ఆశ్వీరచనాలతో ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్-సునంద దంపతుల ఆధ్వర్యంలో చేపట్టిన శతచండీయాగం నాలుగు రోజుల పాటు కొనసాగింది. చండీపారాయ ణం, నవక్షరి మూల మంత్రజపం, ఎకోత్తర వృద్ధి పారాయణం, పుష్పాభిషేకం, సుహాసిని పూజ, ప్రసాద వితరణ, అన్నదానం నిర్వహించారు. శత చండీయాగం శృంగేరి ఆస్థాన పండితులు వాసోజు గోపికృష్ణ శర్మ, విరివింటి ఫణి శశాంక్ శర్మ సమక్షంలో సాగింది. భక్తులు భారీగా హాజరయ్యారు. బెల్లంపల్లి ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య, ప్రజా ప్రతినిధులు, నాయకులు యాగశాలను దర్శించుకున్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...