గులాబీ దళపతి వస్తున్నారు


Sun,March 24, 2019 12:21 AM

- ఏప్రిల్ ఒకటిన సీఎం కేసీఆర్ పర్యటన
- పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ
- రామగుండం సమావేశానికి ఏర్పాట్లు

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 1వ తేదీన పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 29వ తేదీ నుంచి మలి విడత ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏప్రిల్ 1వ తేదీన రామగుండంలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు రామగుండం అనువుగా ఉంటుందని సభ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు. అయితే బహిరంగ సభ రామగుండంలో ఎక్కడ నిర్వహిస్తారు అనేది ఫైనల్ కాలేదు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...