ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం


Sat,March 23, 2019 12:20 AM

- ఉత్సాహంగా ఓటేసిన పట్టభద్రులు, ఉపాధ్యాయులు
మంచిర్యాల ప్రతినిధి, బెల్లంపల్లి నమస్తే తెలంగాణ/ మంచిర్యాల స్పోర్ట్స్ : జిల్లాలో ఎమ్మెల్సీ పోరు ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగగా ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పట్టభద్రుల ఎమ్మెల్సీకి 7,498 ఓట్లతో 53.63శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 1,177 ఓట్లు పోల్ కాగా 81.96 శాతం నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగగా, కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తల్తెకుండా అధికారులు, పోలీసు సిబ్బంది అన్ని చర్యలు తీసుకున్నారు.

జిల్లాలో శుక్రవారం ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 8 గంటలకే ఒటర్లు ఓటు వేసేందు కు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ల పరిధిలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటర్లు మొత్తం 15,416 మంది ఓటర్లు ఉండగా వీరి కోసం 28 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే పట్టభద్రులు 13,980 మంది ఓటర్లు ఉండగా, పురు షులు 9,670 మంది, మహిళలు 4,308 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నా రు. వీరిలో పురుషులు 5,470 మంది, మహిళలు 2,027 మంది, ఇతరులు ఒకరు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 7,498 (53.63 శాతం) ఓట్లు పోలయ్యాయి. అలాగే ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం జిల్లాలో 1436 మంది ఉండగా, పురు షులు 948 మంది, మహిళలు 488 మంది ఉండగా 1177 ఓట్లు(81.96) పోలయ్యాయి. ఇందులో పురుషులు 783, మహిళ లు 394 మంది మహిళలు ఓటు హక్కు వినియో గించుకున్నారు. పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...