గెలుపే లక్ష్యంగా..


Sat,March 23, 2019 12:19 AM

(మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ) పార్లమెంట్ ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్ దూకుడు పెంచేందుకు సన్నద్ధమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే అధికంగా మెజారిటీ తీసుకొచ్చేలా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అసెం బ్లీ, పంచాయతీ ఎన్నికల ఫలితాలు రిపిటీ అయ్యేలా పార్టీ నేతలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల చరిత్రలో ఎన్నడూ లేనంత మెజారిటీ సాధించాలని పార్టీ శ్రేణు లు ముందుకు సాగుతున్నాయి. పార్టీ నేతలు సైతం తమ దూకుడు పెంచారు.

అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల ఉత్సాహంతో
గత అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్‌ఎస్ తన జోష్ కొనసాగించింది. అత్యధిక స్థానాలతో ప్రతిపక్షాలకు అందనంత దూరం వెళ్లిం ది. అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి ఎదురు లేకుండా పోయింది. కొన్ని చోట్ల వేరే పార్టీ వారు గెలిచినా వారు టీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపారు. జిల్లాలో ప్రస్తుతం 90 శాతం మంది సర్పంచులు టీఆర్‌ఎస్ నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రతిపక్షాలకు కనీసం క్యాడర్ కూడా కరువైంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కనీసం పోటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీ నుంచి నేతలు కారువైపు పరుగులు పెడుతున్నారు. ఇంటి పార్టీకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల కార్యాలయాలు బోసిపోతున్నాయి.

అభివృద్ధిని ప్రచారస్త్రంగా ముందుకు..
ఏ ఎన్నికలైనా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని ప్రజలు గమనిస్తున్నారు. ఎల్లంప్లలి ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకాల పూర్తి ఇలా అన్ని రకాలుగా తెలంగాణ ప్రభు త్వం రైతుల పక్షాల నిలిచింది. మరోవైపు రైతు బీమా, రైతు బందు పథకం సాయంతో అన్నదాతల పంటల పెట్టుబడికి అండగా నిలిచిన సర్కారు... రైతు బీమాతో వారి కుటుంబాలకు భరోసా ఇచ్చిం ది. రూ. 200 ఉన్న పెన్షన్ వెయ్యికి పెంచి ప్రస్తుతం రూ. 2,016 చేసింది. దివ్యాంగులకు రూ. 3,016 పెన్షన్ అందిచేందుకు ప్రణాళికలు రూపొందించిన మొదటి సర్కారు టీఆర్‌ఎస్‌దే కావడం విశేషం. మరోవైపు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడపిల్లలకు అండగా ఉంటోంది. సర్కారు దవాఖానాల్లో ఉచితంగా ప్రసవంతో పాటు రూ. 13వేలతో పాటు కేసీఆర్ కిట్లను అందిస్తున్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికి శుద్ధజలం, మిషన్ కాకతీయతతో చెరువుల పూడికతీత వంటి ఎన్నో కార్యక్రమాలను టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపు సులభతరం చేయనున్నాయి.

ఇక ప్రచారం ఉధృతం..
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రచారం ఉధృతం చేసేందుకు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు సన్నద్ధమవుతున్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య తదితరులు అంతా కార్యకర్తలతో ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. వారు ఆ సమావేశాలు ఏర్పాటు చేసుకు ని బూత్‌లు, గ్రామాలు, మండలాల వారీగా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం హాజరుకానున్నారు. పార్లమెంట్ పరిధిలో రెండు చోట్ల సభలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఎంపీ స్థానం ఎలాగైన కైవసం చేసుకోవాలని ముందుకు సాగుతున్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...