ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి


Sat,March 23, 2019 12:19 AM

మంచిర్యాల రూరల్ : ఉపాధిహామీ పథకం పనులు వేగవంతం చేయాలని డీఆర్‌డీఓ శేషాద్రి పేర్కొన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామ శివారులోని చెరువులో చేపల పెంపకానికి ఏర్పాటు చేస్తున్న ఫిష్ ఫౌండేషన్ బెడ్ల పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్బంగా డీఆర్‌డీఓ మాట్లాడుతు పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. నర్సరీలలో మొక్కలలో కలుపు మొక్కలు ఏరివేయాలని కూలీలకు సూచించారు. దీంతో మొక్కలు ఏపుగా పెరుగుతాయన్నారు. డీఆర్‌డీఓ వెంట గ్రామ సర్పంచ్ వోలపు శారద,పంచాయతీ కార్యదర్శి జాదవ మాధవ్, నాయకు లు వోలపు రమేశ్, వార్డు సభ్యులు ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...