అందరికీ పోషకాహారం అందించాలి


Sat,March 23, 2019 12:18 AM

మంచిర్యాల అగ్రికల్చర్: జిల్లాలో పోషకాహార లోపంతో ఎవరూ బాధపడకూడదనీ అందరికీ అం దించాలని కలెక్టర్ భారతి హోళికేరి అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు. పట్టణంలోని జిల్లా పరిష త్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన పోషణ్ అభియాన్ పక్షోత్సవాల ముగింపు కా ర్యక్రమానికి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోషణ లోపం కనిపించకూడదనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పోషణ్ అభియాన్ చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా 8న ప్రారంభమైన పక్షోత్సవాలు 22న ముగిశాయ న్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో రాష్ట్రం లో జిల్లా రెండో స్థానంలో ఉందనీ, ప్రథమ స్థానం సా ధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు వారి వివరాలను తమ పరిధిలోని అంగన్ వా డీ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. గర్భిణులు అంగన్ వాడీ కేంద్రం, ప్రభుత్వ దవా ఖానలో ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే 102, 104, 108 ఆంబులెన్స్ సేవలను వినియోగించుకుని ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకుని కేసీఆర్ కిట్ పొందాలన్నారు. ప్రజలు జిల్లాలోని 18 మండలా ల్లో అంగన్‌వాడీ కేంద్రాలు అందిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గర్భిణులకు మార్వాడీ, జాగృతి ఎన్‌జీవోస్ మహి ళా సంఘం సభ్యులు కలెక్టర్ చేతుల మీదుగా సీ మంతం జరిపించారు. అనంతరం అంగన్‌వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన ఫుడ్ ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖాధికారి అనీత, జిల్లాలోని సీడీపీవోలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణు లు, బాలింతలు, కిశోర బాలికలు, సంబంధిత శాఖ ల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...