యువతకు అండగా నిలిచాం


Sat,March 23, 2019 12:18 AM

మంచిర్యాల రూరల్: పోలీస్ ఉద్యోగాన్ని సాధిం చాలనే యువతకు అండగా నిలిచి వారి లక్ష్యాన్ని చేరువ చేశామని బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాస్ రావు అన్నారు. హాజీపూర్ మండలంలోని గుడిపేట 13వ తెలంగాణ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో ఉద్యోగ శిక్షణ పొందిన యువతీ, యువకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. శ్రీ నివాస్ రావు మాట్లాడుతూ 5 మే, 2018న బెటాలియన్‌లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ప్రా రంభించగా 350 మంది యువతులు, 6 వందల మంది యువకులు పేర్లు నమోదు చేయించుకున్నారన్నారు. వివిధ రకాల ఫిజికల్ ఫిట్‌నెస్ శిక్షణ ఇచ్చి గెస్ట్ ఫ్యాకల్టీతో తరగతులను చెప్పించినట్లు తెలిపారు. మే 5 నుంచి ఫిజికల్ ఫిట్‌నెస్‌లో అర్హత సాధించిన 8 వందల మం దికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో 7 వంద ల మందికి ట్రాక్ సూట్లు, 8 వందల మందికి స్టడీ మెటీరియల్ అందజేసినట్లు స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన పోలీస్ ఈవెంట్స్‌లో 350 మం ది యువతులకు 265, 530 మంది యువకులకు 412 మంది అర్హత సాధించారన్నారు. వీరంతా చి వరి ప్రిలియమ్స్ పరీక్షలకు అర్హత సాధించారని తెలిపారు. శిక్షణ ను వినియోగించకున్న అభ్యర్థులు ప్రి లియమ్స్ పరీక్షకు అర్హత సాధించిన వారు ప్రణా ళికా బద్దంగా చదివి పోలీస్ ఉద్యోగాన్ని సాధించి బె టాలియన్‌కు గుర్తింపు తేవాలన్నారు. బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ జయప్రకాశ్ నారాయణ, అసిస్టెంట్ కమాండెంట్లు నాగానాయక్, శ్రీ నివాస్ రావు, ఆర్‌ఐలు, ఏఆర్‌ఐలు, ఏఆర్ ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...