కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం


Sat,March 23, 2019 12:18 AM

మంచిర్యాల అగ్రికల్చర్: మంచిర్యాల పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ఆవరణలో తెలంగాణ నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి శు క్రవారం పాలాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేశ్ నేతను ప్రకటించినందుకు కేసీఆర్‌కు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వెంకటేశ్ నేతకు ఎంపీ టికెట్ వచ్చేందుకు కృషి చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సాంఘిక సంక్షేమ శాఖ మం త్రి, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గం రాజేశ్, ఉపాధ్యక్షుడు నాగరాజు, గురువయ్య, లక్ష్మణ్, దుర్గం సంతోష్, రాంటెంకి రాజు, రాయమల్లు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...