ఎంపీ అభ్యర్థి ప్రకటనపై సంబురాలు


Fri,March 22, 2019 04:03 AM

చెన్నూర్, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేశ్ నేతను ప్రకటించటం పట్ల చెన్నూర్‌లో గురువారం టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయం ఎదుట టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లెల దామోదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాయిని సతీష్‌రాజ్, నాయకులు రేవెల్లి మహేష్, జాడి తిరుపతి, ఖలీల్, బాపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో ..
బెల్లంపల్లి,నమస్తే తెలంగాణ: పెద్దపల్లి పార్లమెంట్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేశ్‌నేతను టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రకటిం చ డంతో బెల్లంపల్లి పట్టణంలోని భగత్‌సింగ్ చౌర స్తాలో ఆ పార్టీ నాయకులు పటాకలు కాల్చా రు. పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీచేపట్టారు. కార్య క్ర మంలో బెల్లంపల్లి మార్కెట్‌కమిటీ చైర్మన్ సిలువేరు నర్సింగం, టీఆర్‌ఎస్ పట్టణఅధ్యక్షుడు బొడ్డు నారాయణ, టీబీజీకేఎస్ నాయకులు గెల్లి రాజ లింగు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

మందమర్రిలో..
మందమర్రి రూరల్ : పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేశ్ నేతకు టీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడంపై టీఆర్‌ఎస్, టీబీజీకేఎస్, టీఆర్‌ఎస్వీ నాయకులు గురువారం రాత్రి మంద మర్రి మార్కెట్‌లో సంబరాలు జరిపారు. పటాకలు కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సంద ర్భంగా నా యకులు జే. రవీందర్, మేడిపల్లి సంపత్ మాట్లా డారు. బోర్లకుంట వెంకటేశ్ నేతను పెద్దపల్లి ఎంపీ గా గెలిపిస్తామని అన్నారు. బోర్లకుంట వెంకటేశ్‌కు టికెట్ రావడంపై ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషి ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమం లో భట్టు రాజ్‌కుమార్, తోట సురేందర్, కోడల్‌రావు, ముస్తాఫా, జే. శ్రీనివాస్, కృష్ణా బత్తుల శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, మంద తిరుమల్ పాల్గొన్నారు.

కాసిపేటలో..
కాసిపేట రూరల్ : టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేశ్‌కు ప్రక టిం చడంతో గురువారం రాత్రి కాసిపేట మండల కేం ద్రంలో టీఆర్‌ఎస్ శ్రేణులు బాణా సంచా పేల్చి సం బరాలు చేసుకున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్య ర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయ కులు పూస్కూరి విక్రంరావు, మోటూరి వేణు, అగ్గి సత్తయ్య, బోయిని తిరుపతి, లంక లక్ష్మణ్, పిట్టల సుమన్, అక్కపల్లి బుగ్గ రాజు, శేఖర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...