ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి


Fri,March 22, 2019 04:03 AM

మంచిర్యాల రూరల్ : ఉద్యోగ,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంచిర్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్నికల అధికారి సురేశ్ తెలిపారు.గురువారం జిల్లా కేంద్రంలోని కార్మెల్ పాఠశాలలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సురేశ్ మాట్లాడారు. జన్నారంలో రెండు, దండేపల్లి రెండు,లక్షేటిపేటలో ఒక్కటి, మంచిర్యాలలో 11, మందమర్రిలో 4, జైపూర్‌లో ఒకటి, చెన్నూర్‌లో 3, కోటపల్లిలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఎన్నికలకు మొత్తం 200 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. జోనల్ అధికారులు నలుగురు, ఫ్లయింగ్ స్కాడ్ ముగ్గురు, పోలింగ్ అధికారులు 25 మంది, సహాయ పోలింగ్ అధికారులు 100, వెబ్ కాస్టింగ్‌కు 25, మైక్రోఅబ్జర్వర్లు 25, వీడియోగ్రాఫర్స్ 25 మంది, పోలీస్‌లు 25 మందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసిన వారిలో మంచిర్యాల తహసీల్దార్ హన్మంత రావు, కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి సురేష్, మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయం ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ గడియారం శ్రీహరి తదితరులున్నారు.

పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
మందమర్రి రూరల్ : ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికారుల సర్వం సిద్ధం చేశారు. స్థానిక సింగరేణి పాఠశాలలో నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కో పోలింగ్ కేంద్రానికి నలుగురు చొప్పున 16 మందిని కేటాయించారు. ఒక్క జోనల్ అధికారి పని చేస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం 1869 మంది ఉండగా అందులో పురుషులు 1340, స్త్రీలు 529, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం 146, పురుషులు 101, స్త్రీలు 45 మంది ఉన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై, సాయత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఎన్నికలను ప్రశాంత వాతారణంలో నిర్వహించేందుకు మందమర్రి పోలీస్ శాఖ ఇప్పటికే చర్యలు చేపట్టింది. సీఐ రాంచందర్ రావు తో పాటు ఎస్సైలు శివకుమార్, శ్రీకాంత్, ఇద్దరు ఏఎస్సైలు, 10 మంది కానిస్టేబుల్స్, నలుగురు హోంగార్డులు విధి నిర్వహణలోఉంటారు.
జైపూర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జైపూర్, భీమారం మండలాల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కునేందుకు జైపూర్ మండల కేంద్రలోని జడ్పీఎస్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ స్టేషన్‌లో జైపూర్ ఉమ్మడి మండలానికి చెందిన 627 మంది పట్టభద్రులు, 22 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జైపూర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌ను ఏసీపీ వెంకట్‌రెడ్డి గురువారం సంద ర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వివ రాలను పోలింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...