రెండో రోజు శత చండీయాగం


Fri,March 22, 2019 04:02 AM

కోటపల్లి : కోటపల్లిలోని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ స్వగృహంలో చేపట్టిన శత చండీయాగం రెండో రోజుకు చేరుకుంది. ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్-సునంద దంపతుల ఆధ్వర్యంలో చేపట్టిన శత చంఢీయాగం శృంగేరి ఆస్థాన పండితులు వాసోజు గోపీకృష్ణ శర్మ, విరివింటి ఫణి శశాంక్ శర్మ సమక్షంలో కొనసాగుతోంది. గురువారం ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ దంపతులు, కుమారుడు కౌషిక్ సాయి యాగశాలలోని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. చండీపారాయణం, పుష్పాభిషేకం, అష్టోత్తర శతనామావాళి, సుహాసిని పూజ, మత్రపుష్పం, ప్రసాద వితరణ, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రుత్విక్కుల మంత్రోచ్ఛరణతో కోటపల్లిలో పండుగ వాతావరణం కనిపించింది. యాగాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...