రాష్ట్ర స్థాయి అవార్డుకు శ్రీనివాస్ ఎంపిక


Fri,March 22, 2019 04:02 AM

మందమర్రి రూరల్ : మందమర్రికి చెందిన కాసర్ల శ్రీనివాస్‌ను రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక చేసినట్లు లివ్ అండ్ లెట్ లైవ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు పడకంటి రాము గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీనివాస్ సామాజిక సేవలో భాగం గా తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉత్తమ సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రక్తదాన శిభిరాల ఏర్పాటు, తలసేమియా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్పించడం, పదో తరగతి జీవశాస్త్రంలో అనువంశిక వ్యాధులు అనే పాఠంలో తలసేమియా వ్యాధి గురించి చేర్చడం, ఈ వ్యాధితో బాధపడే వారిని వికలాంగులుగా గుర్తింపు నివ్వడం వంటి అంశాల్లో ఆయన ఎనలేని సేవలు అందించారని వివరించారు. ఈ నెల 24న నిజామాబాద్‌లో జరిగే లివ్ అండ్ లెట్ లైవ్ ఫౌండేషన్ వార్షికోత్సవంలో ఈ అవార్డును అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాసర్ల శ్రీనివాస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...