వడగండ్ల వాన


Thu,March 21, 2019 12:17 AM

లక్షెట్టిపేట : జిల్లాలో బుధవారం పలుచోట్ల అకాల వర్షం కురిసింది. లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లో వడగండ్లు పడ్డాయి. మండలంలోని రంగపేట్, హన్మంత్‌పల్లి, దౌడపల్లి, వెంకట్రావ్‌పేట గ్రామాల్లో బుధవారం వడగండ్ల వాన కురిసింది. రంగపేటలో పలువురి ఇండ్లు కూలి నేలమట్టం అయ్యాయి. ఇంటిపై కప్పులు లేచి రేకులు కొట్టుకుపోవడంతో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అలాగే కొమ్ముగూడెం, చందారం, హన్మంత్‌పల్లి, కొత్తూర్, గంపలపల్లిలో సుమారు 25 విద్యుత్ స్తంభాలు విరిగిపోయినట్లు ఏఈ రాజన్న పేర్కొన్నారు. పలు గ్రామాల్లో పంట నష్టం జరిగినట్లు మండల వ్యవసాయాధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

దండేపల్లి : దండేపల్లి మండలం గూడెం, ముత్యంపేట, రెబ్బెన్‌పెల్లి గ్రామాల్లో చెట్లు విరిగిపోయాయి. ఈదురుగాలులకు మామిడిపిందెలు నేలరాలగా, పలుచోట్ల మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...