కార్మికవాడల్లో పోలీసుల కార్డన్ సెర్చ్


Thu,March 21, 2019 12:17 AM

సీసీసీ నస్పూర్ : సింగరేణి కార్మికవాడల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జునకాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది బుధవారం తెల్లవారుజాము నుంచి కాలనీలోని ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలు, కారు, ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ రక్షిత కే మూర్తి మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ సమస్యలు నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలన్నారు. కాలనీల్లోకి వచ్చే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాలని కోరారు. ఎన్నికల్లో గొడవలు, అల్లర్లకు పాల్పడితే కేసులు తప్పవని హెచ్చరించారు. డబ్బు, మద్యానికి దూరంగా ఉండాలని, ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఏసీపీ గౌస్‌బాబా, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...