పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం


Thu,March 21, 2019 12:16 AM

సీసీసీ నస్పూర్ : పోషకాహారం తీసుకుంటేనే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ అనిత పేర్కొన్నారు. పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా నస్పూర్ మండలంలో కిశోర బాలికలకు రక్తపరీక్షలు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సులోచనాదేవి ఆధ్వర్యంలో నస్పూర్ కస్తూర్భాబాలికల విద్యాలయంలో 155మంది బాలికలకు ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షలు చేశారు. అలాగే నస్పూర్, సీతారాంపల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లోని కిశోర బాలికలకు ఏఎన్‌ఎంలు రక్త పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కిశోర బాలికలతో ర్యాలీలు నిర్వహించారు. కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ మౌనిక, అంగన్‌వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రక్త హీనత బారిన పడవద్దు
మంచిర్యాల అగ్రికల్చర్ : కిశోర బాలికలు రక్తహీనత బారిన పడకుండా ఉండేందుకు పౌష్ఠికాహారం తీసుకోవాలని సీడీపీఓ హేమ సత్య సూచించారు. పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని మేదరి వాడ అంగన్‌వాడీ కేంద్రంలో కిశోర బాలికలకు రక్త హీనతపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని సీడీపీఓ మాట్లాడారు. కిశోర బాలికలకు వైద్యులచే రక్త పరీక్షలు చేయించారు. డాక్టర్ రమేశ్, అంగన్ వాడీ సూపర్‌వైజర్ సాల్మ సుల్తానా, ప్రసన్న, ఏఎన్‌ఎం శైలజ, అంగన్ వాడీ టీచర్‌లు విజయ, సత్యవాణి, అంగన్‌వాడీ ఆయా స్వరూప, కిశోర బాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పోషకాహారం తీసుకోవాలి
దండేపల్లి : గర్భిణులు, బాలింతలు పాలు, పండ్లు, కూరగాయలతో కూడిన పోషకాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వాణి పేర్కొన్నారు. దండేపల్లి మండలంలోని కస్తూర్బా విద్యాలయంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా బుధవారం రక్తహీనత, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై నాటక ప్రదర్శన నిర్వహించారు. కస్తూర్బా ప్రత్యేకాధికారి మంజుల, అంగన్‌వాడీ కార్యకర్తలు అనసూర్య, సుజాత, సుమిత్ర, కళావతి పాల్గొన్నారు.

విద్యార్థుల ర్యాలీ
శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్‌లో ఏఎన్‌ఎం, అంగన్‌వాడీల ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో విద్యార్థులతో పోషణ్ అభియాన్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్‌కే 8కాలనీ ప్రాథమిక పాఠశాల, ఆర్‌కే 6గుడిసెల్లోని శారదా శిశుమందిర్ పాఠశాలలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్ధులకు పలు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు పద్మావతి, కవిత, శశికళ, సుమలత పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...