ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని ఆశీర్వదించండి


Wed,March 20, 2019 01:53 AM

-ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి..
-ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి..
-ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలి..
-అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల
జన్నారం : ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా టీఆర్‌ఎస్ బలపరిచే అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జన్నారం మండలకేంద్రంలోని ఎస్‌కే ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు టీఆర్‌ఎస్ సర్కారుపై నమ్మకం ఉండడం వల్లే శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేసి 88మంది ఎ మ్మెల్యేలను రెండోసారి గెలిపించి కేసీఆర్‌ను ము ఖ్యమంత్రిని చేశారని గుర్తుచేశారు. గత ఐదేండ్ల కా లంలో కేంద్రం సహకరించపోవడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందనీ, 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులందరినీ గెలిపించుకుని కేంద్రం నుంచి భారీగా నిధులను తె ప్పించుకొని రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేయాల ని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. అందుకు అ నుగుణంగా ప్రతి నాయకుడు, కార్యకర్త రాష్ట్ర ప్ర భుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలైన షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, మి షన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్‌తో పాటు గ్రామాల్లో చేపటిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కోరారు.

ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సొంత భూమి ఉన్న వారికి అక్కడే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించుకునేందుకు అర్హులందరికీ రూ.6 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. బీడీ కార్మికుల పింఛన్‌కు కటాఫ్ డేట్‌ను తొలగించి అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఇన్ని మంచి పనులు చేసిన టీఆర్‌ఎస్‌ను మరొక్కసారి ప్రజలందరూ దీవించి 16 ఎంపీ స్థానాల్లో గెలిపించుకుని దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఉండేలా ప్రజలందరు కారు గుర్తు కు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముం దు మంత్రి పదవి పొంది పొనకల్ గ్రామానికి మొ దటిసారి వచ్చిన మంత్రి ఐకే రెడ్డిని మండల నా యకులు, సర్పంచులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి సన్మానించారు. సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ జి.నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖానాయక్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సత్యనారాయణగౌడ్, లక్కేరావు, రాంకిషన్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం సతీశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వినయ్, జిల్లా ఉపాధ్యక్షుడు చెట్‌పెల్లి సత్యం, జిల్లా అధికార ప్రతినిధి సిటిమల భరత్‌కుమార్, తిమ్మాపూర్ సర్పంచ్ జా డి గంగాధర్, మాదాడి హన్మంతరావు, మున్వర్ అలీఖాన్, సులువ జనార్ధన్, వొల్లాల నర్సాగౌడ్, గర్రెపెల్లి హరీశ్‌గౌడ్, మల్యాల బాపన్న, సీపతి ఆనందం, రియాజోద్దిన్, ఎస్‌కే మౌలానా, మండలం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...